»   » మహేష్ ‘1’ టీజర్ యూట్యూబ్ లొల్లి, ఫిర్యాదు

మహేష్ ‘1’ టీజర్ యూట్యూబ్ లొల్లి, ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం '1(నేనొక్కడినే)'. ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ చిత్రం సెకండ్ టీజర్‌ తొలగించబడింది. థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఫేక్ హిట్స్ కోసం ప్రయత్నించారనే కారణంతో యూ ట్యూబ్ వెబ్‌సైట్ ఈ వీడియోను డిలీట్ చేసింది.

దీంతో షాకైన ఈ చిత్ర నిర్మాతలు.....తమ సినిమా టీజర్‌‌‌ను యూట్యూబ్ నుండి తొలగించేలా ఎవరో కావాలని కుట్ర చేసారని, ఐపి అడ్రస్ ట్రేస్ చేసి ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు నిర్మాతలు. పోలీసులు ఈ కేసును చేధించే పనిలో ఉన్నారు.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర తాజాగా సుకుమార్ దర్శకత్వంలో '1(నేనొక్కడినే) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

1-nenokkadine

మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Tollywood super star Mahesh Babu’s 1-nenokkadine second teaser has been removed by Youtube website due to Fake hits using some 3 party software. The makers of Mahesh Babu’s 1-nenokkadine have logged a complaint at cyber crime police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu