»   » లుక్ కేక: మహేష్ ‘1-నేనొక్కడినే’ రిలీజింగ్ పోస్టర్లు

లుక్ కేక: మహేష్ ‘1-నేనొక్కడినే’ రిలీజింగ్ పోస్టర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల తేదీతో కూడిన వాల్ పోస్టర్లు రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లపై మహేష్ బాబు లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

తొలి రోజు ఈచిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో తొలి రోజు ఏకంగా.....110కి పైగా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు కలిసి మొత్తం 685 షోలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ట్రైలర్ పరిశీలిస్తే...హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జేమ్స్ బాండ్ సినిమాల మీదిరి ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూడబోతున్నామని తెలుస్తోంది.

రొటీన్ సినిమాల్లా కాకుండా డిఫరెంటు లొకేషన్లలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బైక్, కార్ చేజింగులు, గన్ షాట్స్.....సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుందని అవగతం అవుతోంది.

ల్యాండ్ మార్క్ సినిమా

ల్యాండ్ మార్క్ సినిమా


ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో మహేష్ గూడచారి పాత్రలో నటిస్తున్నాడు. క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.

నటీనటులు

నటీనటులు


సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

100 కోట్లు ఖాయమేనా?

100 కోట్లు ఖాయమేనా?


ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత హిట్ టాక్ వస్తే రూ. 100 కోట్లు వసూలు కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు సినిమాలకు కేవలం యూత్ లోనే కాదు, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఎక్కువ. సుకుమార్ దర్శకత్వం వహించడం అనే అంశం మరింత ప్లస్.

గౌతం తెరంగ్రేటం

గౌతం తెరంగ్రేటం


మహేష్ బాబుతో గతంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారు.

English summary
Prince Mahesh Babu 1 Nenokkadine Movie First Look Wallpapers. Directed by Sukumar and Produced by 14 Reels Entertainment. Music by Devi Sri Prasad. Bollywood Model Kriti Sanon in female lead role.
Please Wait while comments are loading...