»   » 1(నేనొక్కడినే) శాటిలైట్: పవన్‌‌ను బీట్ చేసిన మహేష్

1(నేనొక్కడినే) శాటిలైట్: పవన్‌‌ను బీట్ చేసిన మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు అగ్రహీరోల సినిమాలకు పోటీ పోటీగా శాటిలైట్ రైట్స్ వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) చిత్రానికి భారీ స్థాయిలో శాటిలైట్ రైట్స్ దక్కాయి. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సన్ నెట్‌వర్క్ సంస్థ ఈచిత్రం శాటిలైట్స్ తెలుగు, తమిళ, మలయాళంతో కలిపి రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం పరిస్థితి పరిశీలిస్తే మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 8.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 9 కోట్ల పైచిలుకు రేటుకు అమ్ముడయి సరికొత్త రికార్డు సృష్టించింది.

Mahesh Babu

తాజాగా మమష్ బాబు సినిమా 1(నేనొక్కడినే) అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 12.5 కోట్లకు అమ్ముడు పోయింది. మహేష్ బాబు సినిమాలకు ఫ్యామిలీల ఆదరణ బాగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవిలో మహేష్ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ సినిమా అంటే ఛానెల్స్ పోటీ పడతాయి. అందుకే ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ వచ్చాయి.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 1(నేనొక్కడినే) చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన క్రితి సానన్ హీరోయిన్‌గా చేస్తోంది.

English summary
Sun TV network has bought the satellite rights of Mahesh Babu's 1 Nenokkadine. Sources informed us that the TV channel has paid a whopping price Rs. 12.5 cr for the rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu