మహేష్ బాబు ‘1’ సంచలనం, నెక్ట్స్ లండన్

By Bojja Kumar

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న '1'(ఒక్కడినే)షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

ఈ టీజర్‌కి ఇప్పటికే 1 మిలియన్‌పై హిట్స్ వచ్చి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, ప్రత్యేకంగా సూపర్ స్టార్ అభిమానులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్(బెల్ ఫాస్ట్), లండన్, యుకెలో 60 రోజుల పాటు ఏకధాటిగా భారీ షెడ్యూల్ జరుగుతుంది.

'దూకుడు' తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై చాలా హై ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కి ధీటుగా సుకుమార్ ఈచిత్రాన్ని సరికొత్త స్టైల్‌లో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు' అన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సానన్ హీరోయిన్.

'1' Nenokkadine

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X