మహేష్ బాబు ‘1’: గుమ్మడికాయ కొట్టారోచ్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '1-నేనొక్కడినే' చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో యూనిట్ సభ్యులు గుమ్మడికాయ కొట్టారు. వాస్తవానికి ఈచిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పప్పటికీ కొంత ప్యాచ్ వర్క్ సీన్లు మిగిలి ఉండటంతో ఇపుడు పూర్తి చేసారు.

'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహేష్ బాబు సినిమా అంటేనే యూత్ లోనూ, ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ మహా క్రేజ్. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X