‘1 నేనొక్కడినే’పై ఆడియన్స్ ఏమంటున్నారు? (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేనంతగా ఈ చిత్రం గురించి గత కొంత కాలంగా తెలుగు సినిమా సర్కిల్‌లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. మహేష్ బాబు సినిమాలపై ఉండే భారీ అంచనాలే ఇందుకు కారణం.

ఇప్పటికే విడుదలైన సినిమా ప్రమోలు, టీజర్లు అదరగొట్టే విధంగా ఉండటం, సినిమా ట్రైలర్లు హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం తన కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు చెప్పడం కూడా ఇంత క్రేజ్ రావడానికి మరో కారణం.

'1 నేనొక్కడినే' అనేది సైకలాజికల్ థ్రిల్లర్. భారీ యాక్షన్ కంటెంట్‌తో కూడిన ఈ సినిమాలో మహేష్ బాబు ఎలక్ట్రిప్లయింగ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్. మరో వైపు సుకుమార్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్‌ డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్ రత్నవేలు అమేజింగ్ కెమెరా వర్క్, బ్రిలియంగ్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ అండ్ చేజింగ్ సీన్లు, హీరోయిన్ క్రితి సానన్ గ్లామర్, సినిమా చిత్రీకరణ జరిపిన లొకేషన్లో....ఇలా అన్ని విషయాల్లో సినిమా అదరహో అనిపించేలా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ తెరంగ్రేటం చేస్తుండటం విశేషం.

సినిమాను ఇప్పటికే చూసిన పలువురు సినీ అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్వీట్ల ద్వారా వెలుబుచ్చారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.

Sagar ‏@sachinsagar64

Sagar ‏@sachinsagar64


ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. సెకండాఫ్‌లో ఓవరాల్‌గా 20 నిమిషాలు మినహా మిగతా అంతా చాలా బోర్ కొడుతుంది.

Sreevani ‏@sreevani95

Sreevani ‏@sreevani95


నేనొక్కడినే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది. ఓవర్సీస్ టాక్ జన్యూన్‌గా ఉంది.

BhaskarBachi ‏@Bhaskar_bachi

BhaskarBachi ‏@Bhaskar_bachi


సెండాఫ్‌లో నారేషన్ సరిగా లేక పోవడం, టోటల్‌గా సినిమాలో ఎంటర్టెన్మెంట్ లోపించడం పెద్ద మైనస్ పాయింట్.

Reddy Vinod ‏@vinodbabu1118

Reddy Vinod ‏@vinodbabu1118


మధ్యలో కొంత మినహా సినిమా బాగుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సూపర్. స్క్రీన్ ప్లే బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది.

AshokVarma ‏@ashokgaru

AshokVarma ‏@ashokgaru


ఇంటర్వెల్ ముందు మహేష్ బాబు యాక్టింగ్ సూపర్. మద్యలో బోర్ కొట్టించేసాడు.

SaandeepReddyK ‏@ImSRK20

SaandeepReddyK ‏@ImSRK20


ఫస్టాఫ్ యావరేజ్. ఇంర్వెల్ ముందు 30 నిమిషాల సినిమా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ వరస్ట్. సయానోరా సాంగ్ చాలా బాగుంది.

KK ‏@Kriskk11

KK ‏@Kriskk11


1 నేనొక్కడినే సెకండాఫ్ ట్రిమ్ చేస్తారంట ఫస్ట్ షో నుండి. గౌతం సీన్లు ఎండింగులో పెడతారట.

NTR FANS CLUB ‏@Telugu_film

NTR FANS CLUB ‏@Telugu_film


వెస్ట్ నరసాపురంలో సినిమా చూసిన వారంతా సినిమా కన్ ఫ్యూజింగ్‌గా ఉందని అంటున్నారు.

Sagar ‏@sachinsagar64

Sagar ‏@sachinsagar64


కర్నూలులో ఫస్ట్ డే 17 లక్షలు గ్రాస్ కూడా చాలా కష్టం అని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Survi ‏@PavanSurvi

Survi ‏@PavanSurvi


సాంగ్, చేజింగ్ సీక్వెన్స్ కి రత్నవేలు కెమెరా యాంగిల్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్ ఫెక్ట్.

Laxman Anishetty ‏@laxman219

Laxman Anishetty ‏@laxman219


ఫస్టాఫ్‌లో ఒక 15 నిమిషాలు మిగతా అంత బోరింగ్‌గా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X