మహేష్ బాబు ‘1’ (నేనొక్కడినే) ఫ్రెష్ అప్‌డేట్స్
హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా యుకెలో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగ్ ఈరోజు ముగియనుంది. సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరణ జరిపారు. యూకె, ఐర్లాండ్‌లోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరిగింది.
షూటింగ్ ముగియడంతో యూనిట్ సభ్యులంతా తిరిగి ఇండియా రావడానికి సిద్ధమయ్యారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












