సెపరేట్ రూట్లో మహేష్ తనయుడు గౌతం..! (ఫోటోలు)
హైదరాబాద్: మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఇటీవల విడుదలైన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాక ముందే మహేష్ బాబు తనయుడిగా సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్న గౌతం....'1' సినిమా విడుదల తర్వాత మరింత పాపులర్ అయ్యాడు.
గౌతం తల్లిదండ్రులు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఇద్దరూ సినిమా స్టార్లే కావడంతో....తమ కుమారుడిని భవిష్యత్ స్టార్‌ను చేసేందుకు ఇప్పటి నుండే పక్కా ప్రణాళికతో సపరేట్ రూట్లో ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా నమ్రత శిరోద్కర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
తాజాగా గౌతం చేత '1 నేనొక్కడినే' చిత్రంలోని 'అమ్మ' పాటను విడుదల చేయించారు. ఈ సందర్భంగా గౌతం చేతుల మీదుగా పలువురు చిన్నారులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేయించారు. అందుకు సంబంధించి ఫోటోలు స్లైడ్ షోలో...

అమ్మపాట విడుదల
‘1 నేనొక్కడినే' చిత్రంలోని అమ్మ పాటను విడుదల చేస్తున్న లిటిల్ సూపర్ స్టార్ గౌతం. పక్కనే నమ్రత శిరోద్కర్.

కేక్ కటింగ్
అమ్మ పాట విడుదల కార్యక్రమం సందర్భంగా ‘1 నేనొక్కడినే' లోగో షేపులో తయారు చేసిన కేక్ ట్ చేస్తున్న గౌతం.

చిన్నారులతో గౌతం
‘1 నేనొక్కడినే' చిత్రంలోని అమ్మ పాట విడుదల కార్యక్రమంలో పలువురు చిన్నారులతో కలిసి గౌతం.

బ్యాగుల పంపిణీ
మహేష్ బాబు ఫోటో, ‘1 నేనొక్కడినే' చిత్రం లోగోలతో కూడిన బ్యాగులను పంపిణీ చేస్తున్న గౌతం.

టాలెంటెడ్ బాయ్
వయసు ఏడేళ్లే అయినా.....గౌతం చాలా మెచ్యూరిటీ ప్రదర్శిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











