పది నిమిషాల సీన్‌కు 10 కోట్లు!
గతంలో వచ్చిన 'గజిని" సినిమా ద్వారా సూపర్ హిట్టు కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు హీరో సూర్య-దర్శకుడు మురుగదాస్. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా సినిమా 'సెవెన్త్ సెన్స్". ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈ సినిమా కోసం ఖర్చు కూడా భారీగానే పెట్టారు. తమిళ, తెలుగు వెర్షన్‌లలో ఒకే సారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.... ఇందులో పది నిమిషాల సీన్ చిత్రీకరణకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారు. వినడానికి ఆశ్చర్య కరంగా ఉన్నా ఇది వాస్తవం. సైన్స్ ఫిక్షన్, గ్రాఫిక్స్‌తో కూడుకుని ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు మురుగదాస్‌పై ఉన్న నమ్మకంతో ..నిర్మాత ఉదయ నిధి స్టాలిన్ ఖర్చుకు వెనకాడకుండా ఓకే చెప్పాడు. మరి 10 కోట్లు ఖర్చు పెట్టే అంత అద్భుతం అందులో ఏముందో సినిమా విడుదలైతే గానీ తెలియదు.
సూర్య, శృతి హాసన్ జంటగా నటిస్తున్న '7th సెన్స్" సినిమా తమిళంలో రూపొందిన '7ఎఎం అరివు" చిత్రానికి అనువాదం. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను లక్ష్మి గణపతి ఫిలింస్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు. సూర్య ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలో సర్రస్ కళాకారుడిగా కనిపించ బోతున్నాడు.


Click it and Unblock the Notifications











