పెళ్ళికి ముందు వేరొకరితో...ఈ స్టార్స్ అంతా(ఫొటో ఫీచర్)

By Srikanya

ముంబై: ప్రేమించే వాళ్ల కథలన్నీ పెళ్లళ్లలతోనే ముగుస్తాయా...లేక ప్రేమ ఒకరితో...పెళ్లి మరొకరితో అంటూ ప్రక్కకు తప్పుకుంటాయా అంటే అది వారి పరిస్ధితిని, అప్పటి మానసిక స్ధితిని బట్టి అని చెప్పాలి. పెళ్లికు ముందు ప్రేమలు, బ్రేక్ ప్ లు, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కామన్ అయ్యిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో మరీనూ. తెలుగు ఇంకా అంత స్ధాయికి ఎదగకపోయినా బాలీవుడ్ మాత్రం ఆ హద్దులను ఎప్పుడో దాటేసింది.

అంతెందుకు మొన్న కొత్త పెళ్ళి కూతురు... అర్పితాఖాన్... పెళ్లికు ముందు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిందనే విషయం అందరికీ తెలుసు. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదుగుతున్న అర్జున్ కపూర్ తో బ్రేకప్ చేసుకున్న కొన్ని నెలలలోనే అతను పెద్ద స్టార్ కూడా అయ్యారు. అప్పుడు ఆమె చాలా పశ్చాత్తాపపడుతుందని బాలీవుడ్ పత్రికలు కథనాలు రాసాయి. అయితే అదేమీ లేదని, ఆమె తన మనస్సుకు నచ్చిన ఆయేష్ తో ప్రయాణం ప్రారంభించి, అది జీవిత ప్రయాణం దాకా తీసుకు వచ్చింది.

ఈ విషయమై అర్జున్ కపూర్ సైతం... "నా మొదటి సీరియస్ రిలేషన్ షిప్ అర్పితాతోనే...." అన్నాడు. అతనికి 18 సంవత్సరాల వయస్సులో అతనితో డేట్ చేసిందామె. ఆ బంధం రెండేళ్లు కొనసాగింది. తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్దలు వచ్చి విడిపోయారు. ఇప్పటికీ వీరు విడిపోవటానికి కారణం ఎవరికీ తెలియలేదు. తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోలేదు కూడా. అర్పిత వివాహానికి అతను రాలేదు కూడా. ప్రేమ కథలు బాలీవుడ్ నిండా బోలెడు..వాటిలో టాప్ 10 చూద్దాం.

అమితాబ్-రేఖ

అమితాబ్-రేఖ

అందరికీ తెలిసిన విషయమే ఇది...అమితాబ్ బచ్చన్ వివాహం కాకముందు రేఖతో ఉండేవారిని. అయితే జయాబచ్చన్ తో వివాహానంతరం వీరి బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పటికీ రేఖ, అమితాబ్ ఇద్దరూ మాట్లాడుకోలేదు.

అభిషేక్ బచ్చన్-కరిష్మా కపూర్

అభిషేక్ బచ్చన్-కరిష్మా కపూర్

వాస్తవానికి అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ ల ప్రేమ పెరిగి ..వారి మధ్య ఎంగేజ్ మెంట్ అఫీషియల్ గా జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో ...ఇదిగో ..ఇలా ఐశ్వర్యతో మనోడు ముందుకు వెళ్లాడు.

సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్

సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్

సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ ల మధ్య లవ్ ఎఫైర్ సంగతి తెలియనది ఎవరికి. అయితే పలు రకాల కారణాలతో బ్రేక్ అప్ అయ్యింది. సల్మాన్ ఆమెను కొట్టాడని ఆరోపణలు సైతం వచ్చాయి. ఇప్పటివరకూ వారిద్దరూ ఎదురుపడి మాట్లాడుకున్నది లేదు.

అక్షయ్ కుమార్-శిల్పా శెట్టి

అక్షయ్ కుమార్-శిల్పా శెట్టి

అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి మధ్య చాలా కాలం లవ్ స్టోరీ రన్ అయ్యింది. అతను యువకుడుగా ఉన్నప్పుడు ఆమె ప్రేమలో మునిగితేలాడు. తర్వాత అతను తనను మోసం చేసాడని శిల్పా అంది. నిజం ఏమో కానీ...ఎవరికి వారే వేరే వారితో సెటిలయ్యారు.

జాన్ అబ్రహం-బిపాసా

జాన్ అబ్రహం-బిపాసా


జాన్ అబ్రహం,బిపాసా కలిసి చాలా కాలం సహజీవనం చేసారు. ఆ తర్వాత వీరు ఇద్దరూ పద్దతిగా బ్రేకప్ అనుకున్నారు. ఇక్కడా జానే మోసం చేసాడని అంటారు. కారణం ఏదైనా... వీరు బ్రేకప్ చేసుకున్నారు. ఎవరి దారి వారు చూసుకున్నారు.

షాహిద్ కపూర్-కరీనా

షాహిద్ కపూర్-కరీనా

వీరి లవ్ స్టోరీ చాలా కాలం పాటు బాలీవుడ్ పత్రికలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే షాహిద్ చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకోవటంతో విషయం తెలిసిన కరీనా తప్పుకుని సైఫ్ ని వివాహం చేసుకుంది.

అర్జున్ కపూర్-అర్పిత కపూర్

అర్జున్ కపూర్-అర్పిత కపూర్

మొదటే చెప్పుకున్నట్లు వీరిద్దరి మధ్యా రెండేళ్లు పాటు సీరియస్ ప్రేమాయణం నడిచి అర్దాంతరంగా ముగిసింది.

కల్కి కొచ్చిన్-అనురాగ్ కాశ్యప్

కల్కి కొచ్చిన్-అనురాగ్ కాశ్యప్

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ తన సినిమాలో నటించే కల్కితో నే ప్రేమాయణం నడిపాడు. తర్వాత అది వివాదం దాకా కూడా వెళ్లింది. అయితే ఒక రోజు ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయమన్నారు. అయితే ఇప్పటికీ ఇద్దరూ స్నేహంగా ఉండటం గొప్ప విషయం.

హృతిక్ రోషన్-సుసేన్

హృతిక్ రోషన్-సుసేన్


ఈ జంట విడిపోవటానికి కారణం అర్జు్న్ రాంపాల్ అంటారు. అయితే ఈ విషయమై హృతిక్ మండిపడుతున్నాడనుకోండి. మరో ప్రక్క అదేం లేదు హృతిక్ వేరే అమ్మాయితో లవ్ స్టోరీ నడిపాడు అందుకే ఆమె తప్పుకుంది అంటారు. ఏదైమైనా వీరిద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు.

లారా దత్తా- కెల్లీ దోర్జీ

లారా దత్తా- కెల్లీ దోర్జీ

ప్రముఖ మోడల్ లారా దత్తా, విలన్ వేషాలు వేసుకునే కెల్లీ ఇద్దరూ ఎందుకు విడిపోయారో బాలీవుడ్ లో పెద్ద మిస్టరీ. ఇద్దరూ ఒకరితో ఒకరు అప్పటినుంచీ మాట్లాడుకోరు. లారా ..డినో మారియోతో డేటింగ్ చేయటమే కెల్లీ విడిపోవటానికి కారణం అంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X