twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2014-టాలీవుడ్: సర్ఫైజ్ హిట్స్ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎవడు, 1 నేనొక్కడినే వంటి పెద్ద సినిమాలతో ప్రారంభమైన 2014... చిత్రంగా చిన్న సినిమాల సర్ఫైజ్ హిట్స్ తో నిండిపోయింది. అసలు ఇవి ఆడతాయి..అని ఊహించని చిత్రాలు భాక్సాఫీస్ వద్ద మురిపించాయి. ఓ రంకంగా 2014 చిన్న సినిమాలకు ఊపిరి పోసిందనే చెప్పాలి.

    https://www.facebook.com/TeluguFilmibeat

    ఈ హిట్స్ కారణం..కేవలం ...కొత్తగా ఆలోచించగలిగే సామర్ధ్యమే అని చెప్పాలి. కథనే నమ్మి చేసిన ఈ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మూస ఫార్ములా చిత్రాలుకు బ్రేక్ వేస్తూ ఈ సినిమాలు కొత్తదనానికి ద్వారాలు తెరిచాయి.

    అలాగని కుప్పలు తెప్పలుగా ఈ సినిమాలు ఏమీ వచ్చేయలేదు. వచ్చిన చాలా చిన్న సినిమాల్లో చాలా తక్కువ మాత్రమే భాక్సాఫీస్ కు భరోసాని ఇచ్చాయి. ఆ దర్శకులకు లైఫ్ ను ఇచ్చి నిలబెట్టాయి. ఓ రకంగా ఈ సంవత్సరం చిన్న సినిమాల సంవత్సరంగా చెప్పాలి.

    చిన్న సినిమా ఆడుతోందంటే... పరిశ్రమ కళకళలాడుతున్నట్టే లెక్క. ఈ యేడాది చిన్న సినిమాల విజయశాతం పరిశ్రమకు కొత్త వూపిరి పోస్తోంది. కొన్ని భారీ లాభాలను మూటగట్టుకొంటే.. మరికొన్ని ప్రయత్నాలు విమర్శకుల ప్రసంశలు అందుకొన్నాయి.

    గమనిక: ఈ ఆర్టికల్ లో కేవలం సర్పైజ్ గా అంటే ఎవరూ ఊహించని హిట్స్ ని,మౌత్ టాక్ ద్వారా పికప్ అయ్యిన వాటిని మాత్రమే ప్రస్దావిస్తున్నాం..రేసుగుర్రం వంటి చిత్రాలుగురించి కాదు.

    ఆ సినిమాలేంటనేది స్లైడ్ షోలో చూద్దాం...

    ఊహలు గుసగుసలాడే

    ఊహలు గుసగుసలాడే

    నాగశౌర్య, రాశిఖన్నా కాంబినేషన్ లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లో అందరినీ మురిపించింది. ఆడియో హిట్టవటం, అందంగా సినిమాని తీర్చిదిద్దటం, చక్కటి డైలాగులు ఈ సినిమాను సర్పైజ్ హిట్ గా నిలిపాయి.

    రన్ రాజా రన్

    రన్ రాజా రన్

    షార్ట్ ఫిల్మ్ ల ద్వారా పరిచయమైన సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వరస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు మంచి హిట్ ని ఇచ్చింది. అంతేకాక సుజీత్ అనే టాలెంటెడ్ దర్శకుడుని ఇండస్ట్రీకి పరిచయంచేసింది. ఫన్ తో థ్రిల్స్ ని మిక్స్ చేసి తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది.

    కార్తికేయ

    కార్తికేయ

    నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. మొదట్లో ఓకే అనుకున్న చిత్రం మెల్లిగా పికప్ అయ్యి...స్టాండ్ అయ్యింది. స్వామిరారాతో డిఫెరెంట్ జానర్ చిత్రాలు చేస్తున్న నిఖిల్ ఈ చిత్రంతో మరో మెట్టు ఎక్కారు.కథలో కొత్తదనమే సినిమాకు ప్రాణమై నిలిచింది.

    లౌక్యం

    లౌక్యం

    ఆగడు, గోవిందుడు అందరి వాడేలే చిత్రాల మధ్యలో విడుదలైన ఈ చిత్రం ఆ రెండు సినిమాలు వర్కవుట్ కాకపోవటం,ఇది హిట్ కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికితోడు ఈ మధ్య కాలంలో గోపిచంద్ కు హిట్ లు లేవు. ఆ లోటుని తీర్చింది. బ్రహ్మానందం, పృధ్వీల కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

    అలా ఎలా

    అలా ఎలా

    పెద్ద స్టార్స్ లేకుండా పెద్దగా ప్రమోషన్ లేకుండా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. పూర్తి ఎంటర్టైనర్ గా ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.

    'గీతాంజలి'

    'గీతాంజలి'

    హారర్‌ కామెడీ నేపథ్యంలో వచ్చిన 'గీతాంజలి' కాసుల వర్షం కురిపించింది. రాజ్ కిరణ్ అనే కొత్త దర్శకుడుని పరిచయం చేసిన ఈ చిత్రం అందరి ప్రశంసలూ పొందింది.

    'ప్రతినిధి'

    'ప్రతినిధి'

    నారా రోహిత్ చిత్రాల్లో మంచి హిట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సూటిగా సమాజాన్ని ప్రశ్నించే డైలాగులతో ఈ చిత్రం నిలబడింది. లో బడ్జెట్ లో తీసిన చిత్రం మంచి లాభాలనే మూట గట్టుకుంది.

    'లవర్స్‌'

    'లవర్స్‌'


    చిన్న లవ్ స్టోరీ, సప్తగిరి కామెడీ కలిపికొట్టిన ఈ చిత్రం నవ్వుకునే వారికి నవ్వుకున్నంత అన్నట్లుగా వర్కవుట్ అయ్యింది. చిన్న బడ్జెట్ లో తీసిన ఈ సినిమా పెద్దగానే భాక్సాఫీస్ వద్ద కలెక్టు చేసింది.

    'బూచమ్మ బూచోడు'

    'బూచమ్మ బూచోడు'


    శివాజి కు మార్కెట్ పూర్తిగా కోల్పోయిన సమయంలో వచ్చిన ఈ హర్రర్ కామెడీ మంచి హిట్ గా నిలిచింది. కాంట్రావర్శి జరిగినా విషయమున్న ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు లభించాడు.

    'ది ఎండ్‌'

    'ది ఎండ్‌'

    సంవత్సరం చివర్లో వచ్చిన ఈ హర్రర్ చిత్రం ... చూసిన వారిని బాగానే భయపెడుతోందనే టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా బాగా పికప్ అయ్యి..సర్పైజ్ హిట్ గా నిలిచింది.

    English summary
    2014 year has seen some big releases from big banners. However, the movies that did well were the smaller unnoticed movies which came without much fanfare and picked up steam through word of mouth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X