టాప్ 10 హాటెస్ట్ బాలీవుడ్ ఆన్ స్ర్కీన్ కపుల్ 2012
హైదరాబాద్: 2012 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దేశీయ సినీ రంగంలో మార్కెట్ పరంగా టాప్ లో కొనసాగుతున్న బాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే హిట్ చిత్రాలుగా నిలిచాయి. హిట్ చిత్రాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆ సినిమాల్లో కొందరు హీరో హీరోయిన్లు మాత్రమే టాప్ టెన్ హాటెస్ట్ కపుల్ గా పేరుగాంచాయి.

‘జబ్ తక్ హై జాన్' చిత్రం ద్వారా షారుక్-కత్రినా తొలిసారిగా జత కట్టారు. షారుక్ కు ప్రత్యర్థిగా చెప్పబడే సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అయిన కత్రినా షారుక్ తో జత కట్టి రొమాన్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

గతంలో సల్మాన్-కత్రినా మధ్య ఘాటైన లవ్ ఎఫైర్ ఉండేది. కొన్ని అనుకోని కారణాల వల్ల మధ్యలో విడిపోయిన ఈ ఇద్దరు ‘ఏక్ థా టైగర్' చిత్రంలో కలిసి నటించడం, ఆ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా వర్కౌట్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అక్షయ్ కుమార్, అసిన్ ఈ సంవత్సరం వచ్చిన ‘హౌస్ ఫుల్-2' చిత్రంలో కలిసి నటించారు. ఇది మల్టీ స్టారర్ సినిమా అయినా ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మరోసారి ‘కిలాడి 786' చిత్రంలో కలిసి రొమాన్స్ చేస్తున్నారు.

హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా కలిసి గతంలో ‘క్రిష్' చిత్రంలోనటించారు. తాజాగా ఈ సంవత్సరం ‘అగ్నిపథ్' చిత్రంలో జత కట్టి రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.

అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా తొలిసారిగా ‘సన్ ఆఫ్ సర్దార్' చిత్రంతో జత కట్టారు.

రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ మాస్ హిట్ తర్వాత...అక్షయ్ కుమార్-సోనాక్షి సిన్హా శిరీష్ కుందర్ దర్శకత్వంలో ‘జోకర్' చిత్రంలో నటిస్తున్నారు.

ఇష్క్ జాదే చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన అర్జున్ కపూర్, పరిణితి చోప్రా స్ర్కీన్ పై రొమాన్స్ చేయడంలో తామేమీ తక్కువ కాదని నిరూపించారు.

సైఫ్ అలీ ఖాన్-దీపిక పడుకొనే గతంలో లవ్ ఆజ్ కల్ చిత్రంలో కలిసి రొమాన్స్ చేసారు. తాజాగా ఇటీవల వచ్చిన ‘కాక్ టెయిల్' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసారు.

కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా వరుణ్ ధావన్, అలియా భట్, సిద్ధార్థ మల్హోత్రాలు బాలీవుడ్ తెరకు పరిచయమై తమ హాట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.

దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్-సోనాక్షి సిన్హా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో దబాంగ్ సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సంవత్సరం బాలీవుడ్ తెరపై కనిపించిన జంటల్లో షారుక్ ఖాన్-కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్, అజయ్ దేవగన్-సోనాక్షి సిన్హా, అక్షయ్-అసిన్ ఇలా పలువురు తారలు తమ దైన ముద్ర వేసారు. వీరు టాప్ లిస్టులో చోటు దక్కించుకున్నారంటే ఈ జంటల మధ్య తెరపై కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందన్నమాట. ఆ విశేషాలు ఏమిటో ఫోటో ఫీచన్లో వీక్షిద్దాం..


Click it and Unblock the Notifications











