ఎన్టీఆర్‌ కోసం వెతకండి: రూ. 10 లక్షలు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!

Recommended Video

RGV Finds Chandrababu-Look-alike For Film On NTR

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను తీయబోయే 'లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమా కోసం పాత్రల ఎంపికపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇందులో ముఖ్య పాత్రల కోసం అచ్చం వారిని పోలి ఉండే వారి కోసం వెతుకుతున్న వర్మ... ఇటీవలే చంద్రబాబు నాయుడిలా ఉండే వ్యక్తిని కనుగొన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబులా ఉన్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆతడి ఆచూకి కోసం ప్రయత్నించిన వర్మ... రోహిత్ అనే వ్యక్తి ద్వారా అతడి సమాచారం కనుక్కున్నాడు. తనకు హెల్ప్ చేసిన రోహిత్‌కు రూ. లక్ష బహుమతి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ స్టార్ డైరెక్టర్ సీనియర్ ఎన్టీఆర్ ను పోలి ఉండే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు.

షార్ట్ లిస్టులో ముగ్గరు, కానీ ది బెస్ట్ కోసం...

షార్ట్ లిస్టులో ముగ్గరు, కానీ ది బెస్ట్ కోసం...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశాడు. అయితే ఇటీవల చంద్రబాబును పోలిన వ్యక్తి దొరకడంతో... వర్మలో మరింత నమ్మకం పెరిగింది. ఎన్టీఆర్ మాదిరిగా ఉండే వ్యక్తి దొరికే అవకాశం ఉందని అతడి కోసం వెతకడం ప్రారంభించారు.

రూ. 10 లక్షలు బహుబతి ప్రకటించిన వర్మ

రూ. 10 లక్షలు బహుబతి ప్రకటించిన వర్మ

లక్ష్మి పార్వతిని కలిసిన సమయంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అలాంటి లుక్‌తో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే మాకు ఫోటోలు, వీడియోలు పంపండి. అతడు ఎన్టీఆర్ మాదిరిగా ఉండటంతో పాటు అయనలా మాట్లాడే టాలెంట్ కూడా ఉంటే మాకు సమాచారం అందించండి. వారికి రూ. 10 లక్షలు బహుబతి అందిస్తాను అని వర్మ తెలిపారు.

టాలీవుడ్లో వర్మ మరో సంచలనం

టాలీవుడ్లో వర్మ మరో సంచలనం

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా టాలీవుడ్లో మరో సంచలనం క్రియేట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి కోణంలో ఉంటుందని అతడు చెప్పడంతో ఇందులో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

వర్మ మామూలోడు కాదు కదా

వర్మ మామూలోడు కాదు కదా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వర్మ ఎవరిని నెగెటివ్‌గా చూపిస్తాడు? ఎవరిని పాజిటివ్‌గా చూపిస్తాడు? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుందా? లక్ష్మి పార్వతికి అనుకూలంగా స్టోరీ ఉంటుందా? అంటే.... ఇవేవీ ఉండవని చెప్పక తప్పదు. ఈ సినిమా ద్వారా వర్మ తనదైన వెర్షన్ వినిపిస్తాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X