బర్త్ డే స్పెషల్: సెక్సీ లేడీ గురించిన సీక్రెట్స్ (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ నర్గీస్ ఫక్రి నిన్న 35వ వడిలోకి అడుగు పెట్టింది. ఈ వయసులోనూ అమ్ముడు 20ల్లో భామలా ఆకట్టుకుంటోంది. అమెరికన్ మోడల్ అయిన నర్గీస్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె చూసిన వారు...ఆమె వయసు తెలిసి ఆశ్చర్యపోయారు.

ఈ భామ తన సెక్సీ అందచందాలతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘రాక్ స్టార్' తర్వాత తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ తర్వాత విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది.

ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిక్' సినిమాలో నర్గీస్ చేసిన ఐటం సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నర్గీస్ ఫక్రి బర్త్ డే సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్...

నర్గీస్ ఫక్రి బయోగ్రఫీ

నర్గీస్ ఫక్రి బయోగ్రఫీ

నర్గీస్ ఫక్రి ఫాదర్ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వాడు కాగా, తల్లి చెకోస్లోవియాకు చెందినది. న్యూయార్కులో జన్మించింది.

తన సర్ నేమ్...

తన సర్ నేమ్...

తన సర్ నేమ్ ఫక్రి అనేది మోడలింగ్ రంగంలో ఉన్నపుడు అసలు ఉపయోగించలేదట. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదట.

సాహసాలు అంటే ఇష్టం..

సాహసాలు అంటే ఇష్టం..

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై నడవటం, మచుపిచు లాంటి పర్వతాలు ఎక్కడం లాంటి సాహసాలు అంటే ఆమెకు ఇష్టం.

బాలీవుడ్ గురించి...

బాలీవుడ్ గురించి...

బాలీవుడ్‍‌కి రాక ముందు నాకు ఇక్కడి పరిశ్రమ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన లేకుండానే వచ్చాను. ఇక్కడి వచ్చాక పరిశ్రమలోని పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాను అని నర్గీస్ చెప్పుకొచ్చింది.

అవి కూడా తింటుంది

అవి కూడా తింటుంది

నర్గీస్ ఫక్రీ అన్నిరకాల ఫుడ్ తింటుంది. మొసలి, కప్పలు, చాక్లెట్లో కలిపిన చీమలు కూడా తింటుందట.

అందాల ఆరబోత..

అందాల ఆరబోత..

అందాల ఆరబోత విషయంలో నర్గీస్ ఎలాంటి అభ్యంతరాలు తెలుపదు. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగం నుండి వచ్చింది కాబట్టి.

2005లో మెడలింగులోకి...

2005లో మెడలింగులోకి...

2005లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, అప్పటి నుండి వివిధ ప్రాంతాలు తిరగటం, ఇంటికి దూరంగా ఉండటం అలవాటయిందని నర్గీస్ చెప్పుకొచ్చింది.

మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి...

మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి...

తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ...ఓ నైట్ క్లబ్ లో కలిసాను. ఆరు నెలల తర్వాత ప్రేమలో పడ్డాను. కొంతకాలం కలిసి సహజీవనం చేసాం, జీవితంలో చాలా చేయాల్సి ఉంది కాబట్టి అతని నుండి విడిపోయాను అంటోంది.

పెళ్లి అవసరం లేదు

పెళ్లి అవసరం లేదు

నేను ఇండిపెండెంటుగా ఉండటానికి ఇష్ట పడతాను. నా డబ్బు నేనే సంపాదించుకుంటాను. ఎక్కడికైనా ఒంటరిగా ట్రావెల్ చేస్తాను. అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని తెలిపింది.

ప్రస్తుతం ముంబైలో..

ప్రస్తుతం ముంబైలో..

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న నర్గీస్...ఇక్కడి లైఫ్ స్టైల్‌ను ఎంతో ఇష్టపడుతున్నట్లు తెలిపింది. బాలీవుడ్ సినిమాలు చూడటం అంటే ఇష్టం. ఖాళీగా ఉంటే ఎక్కువ సమయం వాటికే కేటాయిస్తాను అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X