»   » పవర్ స్టార్ క్రేజ్... ‘కాటమరాయుడు’ లెక్క కోటి!

పవర్ స్టార్ క్రేజ్... ‘కాటమరాయుడు’ లెక్క కోటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయని మరోసారి తేలిపోయింది. కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ వ్యూస్ కోటి(10 మిలియన్) మార్కును అందుకోవడమే ఇందుకు నిదర్శనం.

నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో గోపాల గోపాల ఫేం డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరో వైపు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం లాంటి వేడుక ఏమీ లేకుండా ఒక్కోపాట ఇలా నేరుగా యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయడం ద్వారా హైప్ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.


సినిమా రిలీజ్ మార్చి 24న అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా... అందుకు సంబంధించిన హడావుడి మాత్రం కనిపించడం లేదు.


rn

కోటి వ్యూస్

యూట్యూబ్ లో కోటి మార్కును అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన సినిమాపై భారీ క్రేజ్ ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పక తప్పదు.


rn

జివ్వు జివ్వు ఫుల్ సాంగ్

తాజాగా 'కాటమరాయుడు' సినిమా నుండి మూడో పాట ‘జివ్వు జివ్వు ఫుల్' సాంగ్ రిలీజైంది. 'రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా..' అని సాగే ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.


rn

లాగే లాగే సాంగ్

లాగే లాగే అంటూ సాంగే ఈ పాటను నకాష్ అజీజ్ పాడగా...ధనుంజయ్, నూతన అడిషనల్ వోకల్స్ అందించారు. ఈ పాట వింటే మీ మనసు లాగేయడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం వినండి.


rn

మిరా మిరా సాంగ్

మార్చి 3న మిరా మిసా మీసం అంటూ కాటమరాయుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేయటగా... ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ కౌంట్ క్రాస్ అయంది. మరో నాలుగు రోజుల్లో ఈ పాట 50 లక్షల వ్యూస్ సాధించిన సాంగుల లిస్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


English summary
The teaser of Power Star Pawan Kalyan’s soon to be released action entertainer, Katamarayudu, has clocked over one crore views on its official YouTube channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu