twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR సినిమాను మరోసారి చూడాలి అనిపించే 10 అంశాలు.. ఆ ఒక్క డైలాగ్ కు నరాలు కట్!

    |

    రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారి కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా RRR నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కోసమే చాలా మంది సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. మొత్తానికి ఆ శుక్రవారం రానే వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అయితే విజిల్స్ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మరోసారి చూడాలి అనిపించే 10 ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఎక్కువగా వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అవి ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
    రియల్ క్యారెక్టర్స్..

    రియల్ క్యారెక్టర్స్..

    జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లుగా రాజమౌళి ముందుగానే క్లారిటీ ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ కథ మాత్రం కంప్లీట్ గా ఫిక్షన్ అని వారి గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా మంచి అంశాలను తెరపైకి తీసుకు వచ్చినట్లు చెప్పారు.

    న్యాయం చేశారు..

    న్యాయం చేశారు..

    ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు చెప్పినట్లుగానే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ క్యారెక్టర్స్ రెండిటికీ కూడా సరైన న్యాయం చేశారు అని చెప్పాలి. ఆ విషయంలో రాజమౌళి ఎక్కడ తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడు అని అర్థమవుతుంది. సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో అద్భుతంగా వర్కవుట్ అయ్యింది.

    మొదటి పాయింట్

    మొదటి పాయింట్

    ఇక ఈ సినిమాలో హైలెట్ అయిన ఒక పది అంశాలకు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమాను చూసేందుకు మళ్ళీ మళ్ళీ వస్తారు అని చెప్పవచ్చు. మొదట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అతను చూపించిన హావభావాలు. ఆ సీన్ లో భారీ స్థాయిలో జనాలు ఉండడం ఎంతగానో గ్రాండ్ గా అనిపించింది.

    ఎన్టీఆర్ సీన్ కూడా

    ఎన్టీఆర్ సీన్ కూడా


    ఇక మొదట రామ్ చరణ్ తేజ్ ను అల్లూరి సీతారామరాజుగా పాత్రను పరిచయం చేసిన రాజమౌళి ఆ తర్వాత కొమరం భీమ్ ను జూనియర్ ఎన్టీఆర్ గా వెండి తెరపై ఆవిష్కరించాడు. అయితే ఈ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ ను కూడా అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. ఫారెస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ బాడీతో అలా నిలబడి ఇంట్రడక్షన్ ఇవ్వడం థ్రిల్లింగ్ గా అనిపించింది అని ఆడియన్స్ త్రిల్ అవుతున్నారు. ఇది రెండో హైలెట్ పాయింట్

     ఆ సాంగ్స్ స్పెషల్ ట్రీట్

    ఆ సాంగ్స్ స్పెషల్ ట్రీట్

    ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు విడుదల చేసిన సాంగ్స్ వినడానికి ఎంత బాగున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వెండితెరపై మరో లెవెల్లో ఉన్నాయి. నాటు నాటు సాంగ్ లో చూడాల్సిన అద్భుతమైన స్టెప్పులు అయితే ఇంకా చాలానే ఉన్నాయి. వెండితెరపై స్టెప్పులు ఇంకా అందంగా కనిపిస్తాయి. ఇక రాజమౌళి మార్క్ కు తగ్గట్టుగా హై విజువల్ బాండింగ్ తో దోస్తీ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే ఎమోషనల్ గా సాగే కొమరం భీముడు సాంగ్ కూడా గుండెను తాకే విధంగా ఉంది. ఈ మూడు పాయింట్స్ కూడా హైలెట్.

    ఆ ఒక్క డైలాగ్.. నరాలు కట్!

    ఆ ఒక్క డైలాగ్.. నరాలు కట్!

    ఇక ఐదవ ఆసక్తికరమైన అంశం.. అసలైన ఇంటర్వెల్ సీన్ చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఇద్దరు హీరోల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే పాయింట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఆరవ పాయింట్.. అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ నరాలు కట్ అయ్యే ఫీల్ ను కలిగించినట్లు కామెంట్ చేస్తున్నారు. రాముడి కోసం వెళ్లాల్సింది సీతమ్మ తల్లి కాదు.. ఈ లక్ష్మణుడు.. అంటూ భీమ్ అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వారి నుంచి కాపాడే సన్నివేశం అద్భుతంగా ఉంది.

    ఆశ్చర్యపోయే విధంగా..

    ఆశ్చర్యపోయే విధంగా..


    ఇక ఏడవ హైలెట్.. సినిమాలో ప్రతి సన్నివేశంలో కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 8.. ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా మరొక లెవెల్లో ఉంది అనే చెప్పాలి. నిజజీవితంలో అంతా కనెక్షన్ ఉండకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ లో అంత ఒదిగి చేసేవారు కాదేమో అని అనిపించకుండా ఉండదు. ఇక 9.. రాజమౌళి ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 10 ఆశ్చర్యపోయే విధంగా క్లైమాక్స్ సన్నివేశాన్ని తీర్చిదిద్దడం మరొక మేజర్ ప్లస్ పాయింట్. చివరి ఎపిసోడ్ లో ఆడియన్స్ చాలా ఎమోషనల్ అవుతారు అని చెప్పాలి. ఇక ఈ విధంగా RRR లో పది అంశాల సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి అని చెప్పవచ్చు.

    English summary
    10 solid points in RRR That Look Like A Movie Must Watch Again
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X