రెండు వివాహాలు: ఎన్టీఆర్ టు పవన్ కళ్యాణ్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలోని తారలు రెండేసి మూడేసి వివాహాలు చేసుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ ట్రెండు ఇప్పుడు మొదలైందేమీ కాదు. నిన్నటి తరరం అన్న నందమూరి తారక రామారావు నుండి నేటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది ఉన్నారు.
వీరితో పాటు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నటుడు ప్రకాస్ రాజ్, నిన్నటి తరం నటులు చలం, శారద లాంటి వారు చాలా మందే ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి రెండేసి మూడేసి వివాహాలు చేసుకున్న సినీతారలకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

నందమూరి తారక రామారావు
నందమూరి తారక రామారావు తన 20వ ఏట బసవ తరకంను పెళ్లాడారు. 1942లో వీరి వివాహం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరికి 12 మంది సంతానం. బసవతారకం మరణం తర్వాత తన 70వ ఏట(1993)లో లక్ష్మీ పార్వతిని పెళ్లాడారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ 1997లో నందినిని పెళ్లాడారు. అయితే వీరి కాపురం రెండేళ్లకు మించి సాగలేదు. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో సహజీవనం చేసిన పవన్ కళ్యాణ్ 2009లో ఆమెను పెళ్లాడారు. 2012లో రేణుదేశాయ్‌తో విడిపోయిన ఆయన రష్యన్ భామ అన్నా లెజెనెవాను డిసెంబర్ 2013న మూడో వివాహం చేసుకున్నారు.

అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున మొదట నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని 1984లో పెళ్లాడారు. అయితే 1990లో ఇద్దరూ విడిపోయారు. వీరి సంతానం నాగ చైతన్య. అనంతరం తన కోస్టార్ అమలను పెళ్లాడారు. వీరికి అఖిల్ జన్మించాడు.

ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ 1994లో లలితను పెళ్లాడారు. వీరికి మేఘన, పూజా అనే ఇద్దరు కూతుర్లు. 2009లో లలితతో విడిపోయిన ప్రకాష్ రాజ్ కోరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆగస్టు 24,2010న వివాహం చేసుకున్నారు.

రమణ చలం
కోరడ సూర్య చలనం అలియాస్ రమణ చలం మొదట రమణ కుమారిని పెళ్లాడారు. రమణ కుమారి 1964లో జరిగిన ఫైర్ యాక్సిడెంటులో మరణించారు. అనంతరం చలం తన కోస్టార్ ఊర్వశి శారదను పెళ్లారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఆర్ శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ 1984లో ఛాయను పెళ్లాడు. వీరికి ఇద్దరు కూతుర్లు వరలక్ష్మి, పూజా. 2000లో ఈ దంపతులు విడిపోయారు. 2001లో శరత్ కుమార్ నటి రాధికను పెళ్లాడారు.

శరత్ బాబు
ప్రముఖ నటుడు శరత్ బాబు తొలుత నటి రమప్రభను పెళ్లాడారు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అనంతరం ఆయన స్నేహలత దీక్షిత్‌ను పెళ్లాడారు. అయితే ఆమెతో కూడా విడిపోయారు.

కమల్ హాసన్
నటుడు కమల్ హాసన్ తన 24వ ఏట 1978లో వాణి గణపతిని పెళ్లాడారు. పదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. అనంతరం అతను సారికతో సహజీవనం చేసారు. వీరికి శృతి హాసన్ జన్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అనంతరం అక్షర హాసన్ జన్మించింది. 2004లో ఈ ఇద్దరూ కూడా విడిపోయారు. ప్రస్తుతం కమల్ హాసన్ గౌతమితో సహజీవనం చేస్తున్నారు.

రాధిక మూడు వివాహాలు
నటి రాధిక మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత ఆమె వివాహం నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్‌తో 1985లో జరిగింది. ఆమె రెండో వివాహం రిచర్డ్ హార్డీతో జరిగింది. మూడో వివాహం శరత్ కుమార్‌తో జరిగింది.

ఊర్వశి
నటి ఊశ్వశి తొలుత 2000 అక్టోబర్ 1న మనోజ్ కె జయన్ తో జరిగింది. 2008లో వీరు విడిపోయారు. 2013లో ఆమె సివిల్ ఇంజనీర్ శివప్రసాద్‌ను పెళ్లాడారు. ప్రస్తుతం ఆమె గర్భవతి.

ప్రభాకర్
నటుడు ప్రభాకర్ మూడు వివాహాలు చేసుకున్నారు. తొలి వివాహం ద్వారా అతనికి గీత, భారతి, వినోద్ జన్మించారు. రెండో వివాహం చేసుకున్న జయమాల ద్వారా సౌందర్య జన్మించింది. నటి బాబీ అంజును మూడో వివాహం చేసుకున్నాడు. వీరకి అర్జున్ అనే కొడుకు ఉన్నాడు.

ఝాన్సీ
తెలుగు టీవీ యాంకర్ ఝాన్సీకి నటుడు జోగినాయుడుతో వివాహం జరిగింది. అనంతరం ఇద్దరూ విడిపోయారు.

ప్రభుదేవా
నటుడు ప్రభుదేవాకు రమలతాతో వివాహం జరిగింది. అనంతరం అతను నయనతారను రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ అనుకోని కారణాలతో ఇద్దరూ విడిపోయారు.


Click it and Unblock the Notifications











