For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బర్త్ డే బాయ్ సల్మాన్ గురించి... తెలియని నిజాలు(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇటీవలే 'దబాంగ్-2' చిత్రంతో హిట్ కొట్టిన సల్మాన్ చాలా సంతోషంగా బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నాడు. నిన్న అర్ధరాత్రి నుంచే సల్మాన్ అభిమానులంతా ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

  సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27, 1965న జన్మించాడు. ప్రముఖ బాలీవుడ్ రచయిత సలీమ్ ఖాన్, ఆయన మొదటి భార్య సల్మా ఖాన్ పెద్ద కుమారుడే సల్మాన్ ఖాన్. ఈ సంవత్సరం ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఎంతో గ్రాండ్‌గా బర్తడే వేడుకలు జరుపుకుంటున్నారు. 'దబాంగ్ 2' హిట్టవ్వడం ఒకటైతే, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ కావడమే ఇందుకు కారణం.

  2010 సంవత్సరం నుంచి సల్మాన్ ఖాన్ వరుస హిట్లు కొడుతున్నాడు. 2010లో దంబాంగ్ సినిమాతో ప్రారంభమైన సల్లూభాయ్ విజయ ప్రస్థానం...ఆ తర్వాత వచ్చిన రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2 చిత్రాల్లోనూ కంటిన్యూ అయింది. ఈ చిత్రాలన్నీ కూడా రూ. 100 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం.

  సల్మాన్ ఖాన్ గురించి... మీకు తెలియని కొన్ని విషయాలు స్లైడ్ షోలో వీక్షించండి.

  స్కూల్ డేస్ లో సల్మాన్ ఖాన్... గొప్ప ఈతగాడిగా పేరుపొందాడు.

  సల్మాన్ ఖాన్... బీవీ హోతా హై ఆసి(1988) చిత్రంలో సహాయ నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మైనే ప్యార్ కియా సల్మాన్ ఖాన్ తొలి సూపర్ హిట్.

  కెరీర్ ఇబ్బందుల్లో పడ్డ సమయంలో సల్మాన్ ఎప్పుడూ సినిమా అవకాశాల కోసం తన తండ్రి సలీమ్ ఖాన్ పేరు ఉపయోగించుకోలేదు. తానే స్వయంగా వెళ్లి ప్రొడ్యూసర్లను ఒప్పించే వాడు.

  సల్మాన్ ఖాన్ తరచూ రక్తదానం చేస్తూ ఉంటారు. ఆసుపత్రులను సందర్శించి జబ్బుపడిన పిల్లలకు సహాయం చేస్తూ ఉంటారు. అదే విధంగా క్యాన్సర్, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో తన వంతు ప్రచారం చేస్తూ ఉంటాడు.

  సల్మాన్ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు... బీజీగా ఉండే రోజుల్లో వీలు కాక పోతే పని మధ్యలో ఏ కాస్త సమయం దొరికినా జిమ్ లో గడుపుతుంటాడు.

  బిఎండబ్లు, మెర్సిడెజ్ బెంజ్, లాండ్ రోవర్లను నడపటం అంటే సల్మాన్ ఖాన్ కు ఎంతో ఇష్టం.

  ఫిట్ నెస్ విషయంలో, రోజూ వ్యాయామం చేసే విషయంలో సల్మాన్ ఖాన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అతను అనిల్ కపూర్, సైఫ్ ఆలీఖాన్ మరియు హృతిక్ రోషన్ వంటి నటులు శిక్షణ ఇచ్చాడు.

  2004లో పీపుల్స్ మేగజైన్ వరల్డ్ వైడ్ గా నిర్వహించిన ఓటింగులో సల్మాన్ ఖాన్ 7వ బెస్ట్ లుకింగ్ మెన్ ఆప్ ద వరల్డ్ గా నిలిచాడు.

  లండన్‌కు వెళ్లడానికి సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఇష్ట పడుతుంటాడు.

  సల్మాన్ ఖాన్ అభిమాన నటుడు సిల్వెస్టర్ స్టోలెన్, అభిమాన నటి హేమా మాలిని.

  English summary
  Salman Khan is celebrating his 47th birthday today. And he has such a fan following that right after 12 in the night, #HappyBirthdaySalmanKhan began trending on Twitter. The actor who is basking in the success of Dabangg 2 is still one of the most good looking bachelors. Here are some unknown facts about Bollywood hottie Salman Khan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X