»   » ది ఎక్స్‌ట్రామెంటల్స్: ఒకప్పుడు శృతి హాసన్ లోకమే వేరు... (రేర్ ఫోటోస్)

ది ఎక్స్‌ట్రామెంటల్స్: ఒకప్పుడు శృతి హాసన్ లోకమే వేరు... (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ కూతురుగా వెండితెరకు పరిచయమైన శృతి హాసన్ వాస్తవానికి చిన్నతనం నుండి హీరోయిన్ కావాలనేమీ కలలు కనలేదు. చిన్న తనం నుండి ఆమె లక్ష్యం పెద్ద రాక్ స్టార్ అవ్వాలనే. అందుకే 16 ఏళ్ల వయసులోనే రాక్ బ్యాండ్ మొదలు పెట్టింది. శృతి హాసన్ మొదలు పెట్టిన రాక్ బ్యాండ్ పేరు 'ది ఎక్స్‌ట్రామెంటల్స్'.

ఈ బ్యాండ్‌లో శృతి హాసనే లీడ్ సింగర్ కమ్ కీ బోర్డ్ ప్లేయర్. ఈ బ్యాండ్ లో మొత్తం నలుగురు ఉండేవారు. బ్రియాన్ పైవా గిటార్ వాయించేవాడు, కితా అనే వ్యక్తి బాస్ వాయించే వాడు, జెర్మయ్య డ్రమ్స్ వాయించేవాడు.

అప్పట్లో శృతి హాసన్ తన టీంతో కలిసి ఇండియాలోని వివిధ కాలేజ్ ఫెస్టివల్స్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని కాంటెస్టుల్లో కూడా విజేతలుగా నిలిచారు. శృతి హాసన్ రాక్ బ్యాండ్ కు సంబందించిన ఫోటోలు మీరు స్లైడ్ షోలో చూడొచ్చు.

'ది ఎక్స్‌ట్రామెంటల్స్' బ్యాండ్ అప్పట్లో లోకల్ రాక్ సీన్ గా బాగా పాపులర్ అయింది. అయితే అనుకోకుండా 2009లో వీరంతా డిస్‌బ్యాండ్ అయ్యారు. బ్యాండ్ లోని ఓ మెంబర్ పర్సనల్ కారణాలతో బయటకు వెళ్లడంతో ఆ స్థానాన్ని రీప్లేస్ చేయలేక 'ది ఎక్స్‌ట్రామెంటల్స్' డిస్ బ్యాండ్ అయిపోయింది.

ఈ విషయమై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ స్పందిస్తూ...'ది ఎక్స్‌ట్రామెంటల్స్' బ్యాండ్ లోని వ్యవస్థాపక మెంబర్ బయటకు వెళ్లడంతో మేం మళ్లీ మరో బ్యాండ్ ను ఫాం చేయలేక పోయాం. అయితే ఒకటి మాత్రం ష్యూర్...నేను నాకు అవకాశం వచ్చినప్పుడల్లా పెర్పార్మెన్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉంటాను, అది ఇతర బ్యాండ్లతో అయినా కావొచ్చు' అని తెలిపారు.

ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన శృలి హాసన్ ఇక్కడ బిజిగా గడుపుతున్నా తనకు సమయం చిక్కినప్పుడల్లా వేరే బ్యాండ్లతో కొలాబరేట్ అవుతోంది. 'డైనోసార్ పిలె-అప్' అనే బ్రిటిష్ బ్యాండ్ తో కొలాబరేట్ అయి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. త్వరలో ఈ బ్యాండ్ ఓ ఆల్బం రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఆల్బమ్ కు శృతి హాసనే వోకల్స్ అందించారు.

స్లైడ్ షోలో ఫోటోస్..

శృతి హాసన్

శృతి హాసన్

సినిమాల్లోకి రాక ముందు శృతి హాసన్ రాక్ స్టార్ గా అదరగొట్టారు.

అప్పట్లో..

అప్పట్లో..

అప్పట్లో శతి హాసన్ లుక్ చూసారుగా ఎలా ఉందో...

లీడ్ సింగర్, కీబోర్డ్ ప్లేయర్

లీడ్ సింగర్, కీబోర్డ్ ప్లేయర్

తన బ్యాండ్ లో శృతి హాసన్ కీబోర్డ్ ప్లేయర్ గా, లీడర్ సింగర్ గా కొనసాగింది.

కాలేజీ ఫెస్ట్

కాలేజీ ఫెస్ట్

బ్యాండ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. పలు కాలేజీ ఫెస్టివల్స్ లో పాపులర్ అయింది.

బ్యాండ్ సభ్యులు

బ్యాండ్ సభ్యులు

ది ఎక్స్‌ట్రామెంటల్స్ బ్యాండ్ మెంబర్స్ వీరే..

రాకింగ్

రాకింగ్

ఓ కాలేజీ ఫెస్టివల్ లో శృతి హాసన్ రాకింగ్ షో...

గ్లామర్

గ్లామర్

శృతి హాసన్ అప్పట్లోనూ తన గ్లామర్ తో యువతను ఆకట్టుకుంది.

సంగీతమే ప్రపంచం

సంగీతమే ప్రపంచం

అప్పట్లో సంగీతమే లోకంగా శృతి హాసన్ ఉండేది.

బ్రిటిష్ బ్యాండ్

బ్రిటిష్ బ్యాండ్

‘డైనోసార్ పిలె-అప్' అనే బ్రిటిష్ బ్యాండ్ తో కొలాబరేట్ అయి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. త్వరలో ఈ బ్యాండ్ ఓ ఆల్బం రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఆల్బమ్ కు శృతి హాసనే వోకల్స్ అందించారు.

విడిపోయారు

విడిపోయారు

బ్యాండ్ లోని ఒక మెంబర్ బయటకు వెళ్లడంతో ‘ది ఎక్స్‌ట్రామెంటల్స్' డిస్‌బ్యాండ్ అయింది.

English summary
Shruti Haasan, who is a wild rocker at heart, started a rock band at the age of 16, called 'The Extramentals' and was the lead singer and keyboardist. The four member band, consisted of Brian Paiva on guitars, Kitha on bass, Jeremiah on drums and vocals/keyboard by Shruti, and they performed at various college festivals across the country, and also won a few contests.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu