Poonam Pandey 100 కోట్ల పరువు నష్టం దావా.. పూనమ్ పాండేకు లీగల్ దెబ్బ!
సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి తాను మరణించినట్టు డ్రామా ఆడిన పూనమ్ పాండేకు గట్టి దెబ్బ తగిలింది. ఇలాంటి ఫేక్ డెత్ రూమర్లను క్రియేట్ చేసి మీడియాను, ప్రజలను తప్పు దోవపట్టించావు. పాపులారిటీ కోసం ఇలాంటి డ్రామాలు ఆడినందుకు తగిన మూల్యం చెల్లించాలంటూ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
శృంగార తార పూనమ్ పాండే ఇకలేరు. సర్వికల్ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు అంటూ ఆమె మేనేజర్ వెల్లడించిన వార్తతో కొద్ది రోజుల క్రితం సంచలనం రేపింది. చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఓ రోజు తర్వాత ఇదంతా నాటకం. సర్వికల్ క్యాన్సర్ గురించి అందరిలో అవగాహన కల్పించాలని ఈ డ్రామా ఆడాం అని చల్లగా వీడియో రిలీజ్ చేసింది.

పూనమ్ పాండే డెత్ డ్రామాపై న్యాయవాది ఫైజాన్ అన్సారీ తీవ్రంగా స్పందించాడు. క్యాన్సర్ లాంటి సీరియస్ వ్యాధిని అవహేళన చేసే విధంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఎంతో మంది ఎమోషన్స్‌తో ఆడుకొన్నారు. ఇలాంటి ఫేక్ డెత్ కుట్రకు తెరలేపిన వారిపై కేసు నమోదు చేసి ఐఎఫ్ఆర్ కాపీనీ కోర్టుకు దాఖలు చేశారు. వారిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్టు మీడియాకు వెల్లడించారు.
ఫేక్ డెత్ డ్రామా విషయంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావానే కాకుండా పూనమ్ పాండే, సామ్ బాంబేను అరెస్ట్ చేయాలి. వారిని కాన్పూర్ కోర్టులో హాజరుపరుచాలి అని న్యాయవాది ఫైజాన్ అన్సారీ కోర్టుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనమ్ తన భర్తతో కలిసి కట్టు కథ అల్లి మీడియా విలువైన సమయాన్ని, సినీ అభిమానుల మనోభావాలతో ఆడుకొన్నారు అని చెప్పారు.

పూనమ్ పాండే ఫిబ్రవరి 2వ తేదీన తన మరణం గురించి ఆడిన డ్రామాపై అన్సారీ కాన్పూర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఈ నాటకం ఆడారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని ఇలా బజారుకు ఇడుస్తారా? బాలీవుడ్ ఇండస్ట్రీ, లక్షలాది మంది భారతీయ సినిమా అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకొని.. మీడియా విలువైన సమయాన్ని వృథా చేశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పూనమ్ పాండే చేసిన పనిపై బాలీవుడ్ ప్రముఖులు, కంగన రనౌత్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ వ్యవహారాన్ని ఖండించింది. ఈ క్రమంలో 100 కోట్ల పరువు నష్టం దావా వేయడంపై సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











