»   »  సాహో ఫైట్స్ వెనుక దిమ్మతిరిగే నిజాలు.. ప్రభాస్‌తో షూట్ ఎలా అంటే..

సాహో ఫైట్స్ వెనుక దిమ్మతిరిగే నిజాలు.. ప్రభాస్‌తో షూట్ ఎలా అంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీ ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్‌ కూడా భారీగా జరుగుతున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. సాహో చిత్రానికి సంబంధించిన ఫైట్స్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారాయి. ఈ సినిమా ఫైట్స్ గురించి సాహో చిత్ర సినిమాటోగ్రాఫర్ మాధీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

    ఫైట్స్ కోసం 100 రోజుల ప్లాన్

    ఫైట్స్ కోసం 100 రోజుల ప్లాన్

    సాహో కోసం దుబాయ్‌లో 20 రోజులపాటు ఫైట్స్ చిత్రీకరించాం. ఆ ఫైట్స్ కోసం ముందుగా దాదాపు 100 రోజులపాటు ప్లాన్ చేశాం. అందుకోసం కెమెరా టీమ్, స్టంట్ మాస్టర్లందరం పెద్ద ఎత్తున కసరత్తు చేశాం. మేము పక్కాగా ప్రణాళికను రూపొందించుకొని షూట్‌కు వెళ్లడం ద్వారానే ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేశాం అని మాధి వెల్లడించారు.

    కెన్నీ బేట్స్‌ పర్యవేక్షణలో

    కెన్నీ బేట్స్‌ పర్యవేక్షణలో

    సాహో చిత్రం నా కెరీర్‌లోనే ఛాలెంజింగ్ నిలిచిన ప్రాజెక్టు. హాలీవుడ్ చిత్రాలకు స్టంట్స్ అందించిన మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో అద్బుతమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించే అవకాశం రావడం నా జీవితంలో మరిచిపోలేనిది. మా ప్రణాళికలో కేట్స్ భాగస్వామ్యం గొప్పది. కెమెరా యాంగిల్స్, లైటింగ్, కెమెరా ప్లేస్‌మెంటస్ గురించి కేట్ చాలా వివరంగా ప్లాన్ ఇచ్చారు.

    సాహో ఫైట్స్ కోసం

    సాహో ఫైట్స్ కోసం

    సాహో ఫైట్స్ కోసం ఉపయోగించే కెమెరాలను, కొన్ని సీన్లకు ప్రత్యేకంగా చిత్రీకరించే విధానం విషయంలో కేట్స్ అందించిన సహకారం అద్భుతం. దాదాపు ఈ ఫైట్స్ కోసం 80 మందితో కూడిన కెమెరా నిపుణుల బృందం పనిచేసింది. కేట్స్ స్టంట్స్ మాస్టర్ పర్యవేక్షణలో 120 మంది పనిచేశారు. దాదాపు 8 రోజులపాటు కెమెరా ఏర్పాట్లు, ప్లేస్‌మెంట్స్ కోసం కసరత్తు చేశాం.

     సాహోకు హైలెట్

    సాహోకు హైలెట్

    సాహో ఫైట్స్, యాక్షన్ సీన్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొన్న తర్వాత టెస్ట్ షూట్ చేశాం. ఆ తర్వాతనే ప్రభాస్, ఇతర నటీనటులపై లైవ్ యాక్షన్ సీన్లను షూట్ చేశాం. 20 రోజులపాటు చిత్రీకరించిన సన్నివేశాలు సాహోకే సినిమా చరిత్రలోనే హైలెట్‌గా నిలుస్తాయి అని మాధి పేర్కొన్నారు.

     రూ.300 కోట్ల బడ్జెట్

    రూ.300 కోట్ల బడ్జెట్

    సాహో చిత్రం సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Actor Prabhas is currently busy shooting for the much-awaited action film Saaho which is being shot simultaneously in Hindi and Telugu. The actor, along with his crew members, is in Dubai to shoot some sleek action sequences. A couple of pictures of the actor from the sets of the film surfaced on social media. Prabhas is seen sitting on a super bike and checking out his ride for the day. Will there be bike chases in the film? This picture was taken in Abu Dhabi.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more