»   » నాగచైతన్య ‘100% లవ్’ చిత్రం రీమేక్ వివరాలు

నాగచైతన్య ‘100% లవ్’ చిత్రం రీమేక్ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన '100% లవ్"చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ సునామి సృష్టిస్తో న్న ఈ చిత్రం హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. హిందీలో ఓ టాప్ నిర్మాత బారీ ఆఫర్ ఇచ్చి అల్లు అరవింద్ ని కలిసి డీల్ సెటిల్ చేసుకున్నట్లు చెప్తున్నారు.హిందీలో రొమాంటిక్ కామిడీలకు ఉన్న డిమాండ్ ని బట్టి ఈ చిత్రం రీమేక్ రైట్స్ మంచి మొత్తానికే ఇచ్చినట్లే తెలుస్తోంది. మరో ప్రక్క తమిళ, మళయాళ పరిశ్రమలనుంచి కూడా ఈ చిత్రానికి రీమేక్ ఆఫర్స్ వస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం మొదటి వారం దాదాపు పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షలు వరకూ వసూలు చేసింది. ఈ చిత్రం బడ్జెట్ పదకొండు కోట్లు. దాంతో ఈ చిత్రం అప్పుడే ప్రాఫిట్ లోకి వచ్చిందని చెప్తున్నారు. లాంగ్ రన్ లో దాదాపు 20 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు. నూటయాభై ప్రింట్లతో దాదాపు 250 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ధియోటర్స్ త్వరలోనే పెంచే ఆలోచనలో నిర్మాత బన్నీ వాసు ఉన్నారు.

English summary
Director Sukumar has come up with successful film 100% love. The film is doing well at the Tollywood box office. Before staring Mahesh Babu's film, Sukumar wants to remake his 100% Love in Hindi and a top producer has come forward to remake this film in Hindi. More details soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu