తమన్నా అందాలతో ‘100% లవ్’కి అక్కడ డిమాండ్ పెరిగిపోయింది...
శతృఘ్నసిన్హా తనయుడు, సోనాక్షి సిన్హా సోదరుడు లువ్ సిన్హా తెలుగు చిత్రం '100% లవ్"ని చూసాడట. ఈ సినిమా అతనికి పిచ్చ పిచ్చగా నచ్చేసిందని, అందులోనూ తమన్నా పాత్ర మరింతగా నచ్చిందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో హీరోగా లవ్ సిన్హా నటించాలని అనుకుంటున్నాడట. .
తన సరసన తమన్నానే హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలకుంటున్నాడట లువ్ సిన్హా. అంతే కాకుండా హీరోయిన్ సోనాక్షి సిన్హా, శతృఘ్నసిన్హా కూడా ఈ చిత్రాన్ని చూసి చాలా ఇంప్రెసయ్యారట. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ తో దీని గురించి శతృఘ్నసిన్హా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని ఒకే అయితే 100% లవ్" హిందీ రీమేక్ త్వరలోనే ఆరంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ '100% లవ్"కోసం బాలీవుడ్ లో ముగ్గరు, నలుగురు నిర్మాతలు పోటీపడుతున్నారని సమాచారం.
More from Filmibeat
tamanna 100% love naga chaitanya love sinha shatrughan sinha తమన్నా 100% లవ్ నాగచైతన్య లువ్ సిన్హా శతృఘ్నసిన్హా


Click it and Unblock the Notifications











