హండ్రెడ్ పర్సెంట్ లవర్ హండ్రెడ్ పర్సెంట్ కత్తిలా వుంది కదూ...
100% లవ్" సినిమాతో తెలుగులో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా..'హ్యాపీడేస్" తో తెలుగులో హిట్టు కొట్టినా..'కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమతో పర్వాలేదనిపించుకున్నా..కెరీర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళే సక్సెస్ మాత్రం '100% లవ్" సినిమాతోనే దక్కింది తమన్నాకి.
ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో బిజీగా వున్నతమన్నా, 'బద్రినాథ్" సినిమాతో కుర్రకారుని మరింత కిర్కెక్కించనుంది. ఆల్రెడి 'బద్రినాథ్" స్టిల్స్ లో తమన్నా హాట్ అప్పీల్ ఏ రేంజ్ లో వుండబోతోందో తేలిపోయింది. తాజాగా విడుదలైన స్టిల్స్ తో 'బద్రినాథ్" లో తమన్నా గ్లామర్ '100% కత్తి" అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నది రావుగోపాల్ రావు డైలాగ్..హీరోయిన్ అన్నాకా '100% గ్లామర్ వుండాలన్నది తమన్నా లేటెస్ట్ డైలాగ్"..గ్లామర్ కోసం ఏం చేయడానికైనా రెడీ..అంటోన్న తమన్నా ఫెర్ఫామెన్స్ పరంగా ఎలాగూ మార్కులు కొట్టేస్తోంది కాబట్టి, హీరోయిన్ గా నెంబర్ వన్ ప్లేస్ ఆమెకు ఎంతో దూరం లేదన్పిస్తోంది కదూ టాలీవుడ్ లో..!?


Click it and Unblock the Notifications











