వందేళ్ల బాలీవుడ్లో జిగేల్‌మన్న హీరోయిన్లు (ఫోటోలు)
ముంబై : భారతీయ సినిమా ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకుంది. 1913లో ప్రారంభమైన భారతీయ సినిమా ప్రస్తానం నేటితో శతాబ్దిలో అడుగిడింది. తొలి నాళ్లలో మూకీ సినిమాలే వచ్చాయి. అయితే తొలి టాకీ మూవీ మాత్రం 1931లో వచ్చింది. బాలీవుడ్లో ఈ వందేళ్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఎంతో మంది స్టార్స్ వెండితెరపై తమదైన ముద్ర వేసారు. లెజెండ్స్‌గా, సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. అయితే భారతీయ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మేల్ ఓరియెంటెడ్ సినిమాలే రాజ్యమేలుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితులనోనూ కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలో తమదైన మద్రవేసి చిరస్థాయిగా నిలిచి పోయారు.
బాలీవుడ్ హీరోయిన్లలో నర్గీస్, స్మితా పాటిల్, షబానా అజ్మీ, రేఖ, శ్రీదేవి, మాధురి దీక్షిత్, హేమా మాలిని, ఐశ్వర్యరాయ్, విద్యా బాలన్ నటనలో తమదైన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. పురుషాధిక్య సినిమా ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు.

హిందీ సినిమా తొలితరం హీరోయిన్ అయిన నర్గీస్....బాలీవుడ్ చరిత్రలో గ్రేటెస్ట్ హీరోయిన్

స్మితా పాటిల్ బాలీవుడ్ బెస్ట్ నటీమణుల్లో ఒకరు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు వరించాయి.

ఐదు సార్లు జాతీయ అవార్డు దక్కించుకోవడంతో పాటు, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న నటి షబానా అజ్మీ

బాలీవుడ్ చరిత్రలో మధువాల వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన

డ్రీమ్ గర్ల్ గా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది హేమా మాలిని. 40 ఏళ్లలో 150కి పైగా చిత్రాల్లో నటించింది.

హిందీ పరిశ్రమను ఏలిన సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో శ్రీదేవిది ప్రత్యేక స్థానం.

హీరోయిన్ రేఖ...ఒకప్పుడు బాలీవుడ్‌ను రూల్ చేసి బెస్ట్ హీరోయిన్

తన అందం, అభినయంతో సినీ ప్రియులను కట్టిపడేసిన తార మాధురి దీక్షిత్

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్..అందంతో పాటు అభినయంలోనూ బెస్ట్ అని నిరూపించుకుంది.

విభిన్నమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ ఏ పాత్రలో ఇట్టే ఇమిడిపోతుంది.


Click it and Unblock the Notifications











