రజనీ, కమల్, బాలయ్య, త్రిష 100 సినీ ఫెస్ట్

By Bojja Kumar

హైదరాబాద్: భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం వేడుక ప్రారంభమైంది. తమళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ వేడుకలను ప్రారంభించారు. వేడుకల నిర్వహణకు ఆమె ప్రభుత్వం తరుపున రూ. 10 కోట్లు స్పాన్సర్ చేసారు కూడా. 4 రోజుల పాటు వేడుక నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ...తన జీవితానికి చిరునామాగా నిలిచిన సినీ పరిశ్రమను ఎన్నటికీ మరువలేనని ఈ సందర్భంగా జయలలిత అన్నారు. సినిమా వందరోజులు ఆడితే పెద్ద పండగ, సినిమా పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి. సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం కూడా అందిస్తుంది అని జయ వ్యాఖ్యానించారు.

కాగా....ఈ వేడుక అంతా జయలలిత కనుసన్నల్లో సాగుతోంది. నిర్వాహకులు సైతం అమ్మ జపం తప్ప మరొటి చేయడం లేదు. ఈ వేడుక మొత్తం జయలలిత తప్ప మరెవరూ హైలెట్ కాకుండా చూసుకుంటూ.....ఆమ్మ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తొలి రోజు వేడుకలో రజనీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, త్రిష, మీనా తదితరులు మెమొంటోలు అందుకున్నారు.

బాలకృష్ణ

బాలకృష్ణ


వందేళ్ల సినిమా పండగలో భాగంగా తొలి రోజు వేడుకలో ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా మెమొంటో అందుకుంటున్న తెలుగు నటుడు బాలకృష్ణ

రజనీకాంత్

రజనీకాంత్


ప్రముఖ సౌతిండియా స్టార్ రజనీకాంత్ చెన్నైలో ప్రారంభమైన వందేళ్ల సినిమా పండగలో జయలలిత చేతుల మీదుగా మెమొంటోను అందుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కమల్ హాసన్

కమల్ హాసన్


విలక్షణ నటుడు కమల్ హాసన్ శనివారం ప్రారంభమైన వందేళ్ల సినిమా పండగలో జయలలిత చేతుల మీదుగా మొమొంటోను అందుకున్నారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

త్రిష

త్రిష


సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పటి వరకుసౌతిండియా సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. ఈ సందర్భంగా త్రిష కూడా జయలలిత చేతుల మీదుగా మొమోంటో అందుకున్నారు.

మీనా

మీనా


ఒకప్పటి సౌతిండియా స్టార్ హీరోయిన్ మీనా శనివారం ప్రారంభమైన వందేళ్ల సినిమా పండగలో ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా మొమొంటో అందుకున్నారు.

ఇళయరాజా

ఇళయరాజా


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వందేళ్ల సినిమా పండగలో ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా మెమొంటో అందుకున్నారు.

సిమ్రన్

సిమ్రన్


సౌతిండియా నటి సిమ్రాన్ వందేళ్ల సినిమా పండగలో జయలలిత చేతుల మీదుగా మెమొంటో అందుకున్నారు.

జయప్రద

జయప్రద


ప్రముఖ నటి జయప్రద వందేళ్ల సినిమా పండగలో జయ లలిత చేతుల మీదుగా మెమొంటో అందుకుంటున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

జయసుధ

జయసుధ


ప్రముఖ నటి జయసుధ వందేళ్ల సినిమా పండగలో జయ లలిత చేతుల మీదుగా మెమొంటో అందుకుంటున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

మనోరమ

మనోరమ


ప్రముఖ నటి మనోరమ వందేళ్ల సినిమా పండగలో జయ లలిత చేతుల మీదుగా మెమొంటో అందుకుంటున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X