»   » మీరెవ్వరూ ఆ సినిమా చూడలేరు...

మీరెవ్వరూ ఆ సినిమా చూడలేరు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు చదివిన టైటిల్ నిజమే... ప్రస్తుతం బూమ్మీద ప్రాణాలతో ఉన్న వ్యక్తులు ఎవరూ ఆ సినిమా చూడలేరు. ఒక వేళ మీరు వందేళ్లు మించి బ్రతికితే మాత్రం ఆ సినిమా చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే.... 100 ఏళ్ల తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.

హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే తెరకెక్కించిన '100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్‌ సీ' చిత్రం 2115వ సంవత్సరం నవంబర్‌ 18న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పుడున్న వారెవరూ చూడలేని, ఇప్పట్లో విడుదల కాని ఈ సినిమాను తీయడం ఎందుకు? అనే డౌట్ మీకు రావొచ్చు.... వెర్రి వేయి విధాలా అంటే ఇదే. రికార్డుల కోసం కూడా ఇలాంటి సినిమా తీయొచ్చు.

100 Years: The Movie You Will Never See

అసలే పైరసీ రాజ్యమేలుతున్న ఈ ఆన్ లైన్ కాలంలో ...... అన్నేళ్లు ఆ సినిమా బయటకు లీక్ కాకుండా ఎవరు కాపాడతారు? అంటే అందుకు సంబంధించిన తగిన ఏర్పాట్లు చేసామని అంటున్నారు. ఈ సినిమా ప్రిటును బుల్లెట్‌ ప్రూఫ్‌ లాకర్‌లో పెట్టి 18 నవంబర్‌ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్‌ చేశారు.

వందేళ్ల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానిస్తారట. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు వీళ్లు కూడా ఈ సినిమా చూడలేరు. వారి వారసులే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? సినిమాలో ఏం చూపించారు? తెలియాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే.

English summary
100 Years: The Movie You Will Never See is an upcoming film written by and starring John Malkovich and directed by Robert Rodriguez. 100 Years is due to be released on 18 November 2115.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu