‘1000 అబద్దాలు’:ఇది తేజ చిత్రం కాదు
హైదరాబాద్ : సాధారణంగా...తమ చిత్రాలకు ఎ ఫిల్మ్ బై అని దర్శకుడు తన పేరు వేసుకోవటం ఆనవాయితీనే. అయితే దర్శకుడు తేజ ఈ సారి ...ఎ ఫిల్మ్ నాట్ బై తేజ అనే నెగిటివ్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెయ్యి అబద్ధాలు' చిత్రానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చర్చనీయాంసంగా మారింది.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.
ఏప్రిల్ 10తో పాటల చిత్రీకరణ పూర్తవుతుందని, అదే నెల 15న పాటలను విడుదల చేస్తామని నిర్మాత సునీత పాలడుగు తెలిపారు. రమణ గోగుల స్వరాలిందిస్తున్న ఈ చిత్రంషూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ''వినోదాత్మకంగా సాగే కథ ఇది. హీరో పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది'' అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ 'వెయ్యి అబద్ధాలు'సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది.
ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications












