Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పదేళ్ల దాంపత్యం: ఐశ్వర్య-అభిషేక్ అరుదైన పెళ్లి ఫోటోస్
హైదరాబాద్: ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ వివాహం జరిగి నేటితో 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వీరిద్దరికి సంబంధించిన అరుదైన పెళ్లి ఫోటోలను అభిమానుల కోసం ప్రజెంట్ చేయడాన్ని మించినది ఇంకేముంటుంది?
ఐష్-అభి మధ్య ఎలా పరిచయం ఏర్పడంది? ఇద్దరి మనసులు కలిసిన సందర్భం ఏది? పెళ్లి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు.... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి. ధూమ్-2 సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. డేటింగ్ చేయడం ప్రారంభించారు. వయసులో తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐష్ ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది.
పెళ్లికి ముందే ఇద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అటాచ్మెంట్ పెరిగింది. ఆ అనుబంధమే ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసింది. ఐశ్వర్య వయసులో పెద్ద అయినా వారి పెళ్లికి ఇవేమీ అడ్డు రాలేదు.
ఇద్దరి పండంటి కాపురానికి గుర్తుగా 'ఆరాధ్య' జన్మించింది. ఎలాంటి కలతలు, గొడవలు లేకుండా గత పదేదేళ్లుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ అనోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు.
ఐష్-అభి
బాలీవుడ్లో జరిగిన అత్యంత ఖరీదైన వాహాల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం కూడా ఒకటి.
అమితాబ్ బచ్చన్
తన కొడుకు, కొడలి వివాహం జరిగి అప్పుడే పదేళ్లు గడిచి పోయాయంటే నమ్మలేక పోతున్నారు అమితాబ్ బచ్చన్.
గుర్రంపై అభిషేక్
వివాహ వేడుక సందర్భంగా గుర్రంపై వస్తూ అభివాదం చేస్తున్న అభిషేక్ బచ్చన్.
గ్రాండ్ వెడ్డింగ్
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ వివాహం జరిగి నేటితో పదేళ్లు పూర్తయింది. ఎంతో గ్రాండ్ గా వీరి వివాహ వేడుక జరిగింది.
ప్రపోజల్
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గరు' సినిమా సమయంలో అభిషేక్ బచ్చన్ తన మనసులోని మాటను ఐశ్వర్యకు వెల్లడించారు. ఐశ్వర్య అతని ప్రపోజల్ కి ఓకే చెప్పింది. అలా వీరి ప్రేమకు జీజం పడింది.
ఐష్
వివాహ వేదిక వద్దకు వస్తూ ఐశ్వర్యరాయ్ ఇలా...... వయసు పెరిగినా ఐశ్వర్యరాయ్ లో ఆ అందం ఏ మాత్రం తరగలేదు.
అభిషేక్ బచ్చన్
ఐశ్వర్యరాయ్ తన భార్యగా దొరకడం ఎంతో లక్కీగా ఫీలవుతుంటాడు అభిషేక్. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భర్త కోసం...
భర్త కోసం వంట నేర్చుకోవడంతో పాటు...ఎన్నో రుచికరమైన వంటలు అతనికి చేసి పెడుతుందట ఐష్.
అమితాబ్ బచ్చన్
ఐష్ తో తన ప్రేమ విషయాన్ని....అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులైన అమితాబ్-జయకు చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట.
పదేళ్ల ప్రేమబంధం
పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తూ....ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు ఐష్-అభి. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడూ బలహీన పడలేదు.