బాలకృష్ణ మళ్లీ కొంప ముంచేశాడు.. బుల్ బుల్ సితారా తర్వాత .. ట్రెండింగ్‌గా వీడియో
టాప్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగాలు ఈ మధ్య మీడియాలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన ఏం మాట్లాడినా దానిని ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో బాలయ్య కొన్ని స్పీచ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. తాజాగా 118 ప్రీ రిలీజ్ వేడుక బాలయ్యను మరోసారి ఇబ్బందిలో పడేసింది. అదేమిటంటే..

118 ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా
ఎన్టీఆర్: మహానాయకుడు సినిమా దారుణమైన పరాజయం తర్వాత బాలకృష్ణ మొదటిసారి 118 మూవీ వేడుకలో ముఖ్య అతిథిగా దర్శనమిచ్చాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి వేదికను పంచుకొన్నాడు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ గురించి తప్పుగా మాట్లాడటం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

118 టైటిల్‌ను తప్పుగా మాట్లాడటం
118 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ పదేపదే తప్పులో అడుగేశాడు. ఈ సినిమా టైటిల్‌ను పదే పదే 189గా చెప్పడం మీడియాను, వేదికపైన ఉన్న వాళ్లను కంగారు పడేలా చేసింది. మధ్యలో కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినా చివర్లో 189 అంటూ బాలయ్య చెప్పడం మీడియా దృష్టిలో పడింది.
వైరల్‌గా బాలకృష్ణ వీడియో
118 సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ ప్రసంగం వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై జోకులు పేలుతున్నాయి. సినిమా టైటిల్‌ను కూడా సరిగా పలుకలేకపోయాడే అంటూ కామెంట్లు విసిరారు. వేదికపై ఈ వ్యవహారం కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, అభిమానులను విస్తుపోయేలా చేశాయి.

పూజా హెగ్డే అందం గురించి
గతంలో అరవింద సమేత చిత్ర వేడుకకు హాజరైన బాలకృష్ణ గమ్మత్తైన స్పీచ్ ఇవ్వడం ట్రెండింగ్‌గా మారింది. హీరోయిన్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. షబ్నం అంటూ హిందీలో కవిత చెప్పడానికి ప్రయత్నించడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ వీడియో కూడా ట్రెండింగ్‌గా మారింది.

అసెంబ్లీలో ఎన్నికల్లో బుల్ బుల్ సితారా
ఇక గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బాలకృష్ణ ప్రసంగం వివాదాస్పదమైంది. కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహించిన బాలయ్య.. వాహనంపై నుంచి మాట్లాడుతూ.. బుల్ బుల్ సితారా అనడం వివాదంగా మారింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











