జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’కు ఈరోజు స్పెషల్!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్ షా'గా త్వరలో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటడానికి వస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే 12/12/12 తేదీని ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ గా జరుపుకుంటున్నారు. ఈ తేదీ బాద్ షా చిత్రానికి కూడా స్సెషల్ గా మారింది. ఈ రోజే ఈచిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. నేటి నుంచి డబ్బింగ్ మొదలు కానుంది. మరో వైపు షూటింగ్ కూడా పారలాల్‌గా జరుగనుంది. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
జూ ఎన్టీఆర్ కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు తోడు, ఢీ, రెడీ, దూకుడు లాంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల సినిమా కావడంతో ఈ చిత్రానికి బుల్లితెర మార్కెట్లో డిమాండ్ ఏర్పడి శాటిలైట్ రైట్స్ భారీగా వచ్చాయని టాక్. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











