పన్నెండేళ్ల ‘రెడీ’.. అంతా నిన్న జరిగినట్టే ఉందన్న శ్రీనువైట్ల
రెడీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఢీ సినిమా తరువాత మళ్లీ అంతటి రేంజ్‌లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సినిమా రెడీ. కామెడీ, ఎమోషన్, లవ్, యాక్షన్ ఇలా అన్నింటిని మేళవించి అద్భుతంగా తెరకెక్కించాడు శ్రీను వైట్ల. గోపీమోహన్, కోన వెంకట్, శ్రీను వైట్లది డెడ్లీ కాంబినేషన్ అని మరోసారి ఫ్రూవ్ చేశారు. రెడీ చిత్రానికి నేటితో పన్నెండేళ్లు పూర్తి కావడంతో శ్రీను వైట్ల నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.
రామ్, జెనీలియా జంటగా వచ్చిన రెడీ చిత్రం అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. వంద రోజులు ఆడి స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా నిలబడింది. ఈ సినిమా రామ్ జెనీలియా కెమిస్ట్రీ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, బ్రహ్మానందం, భరత్ కామెడీ అన్నీ హైలెట్‌గా నిలిచాయి. నాటి మాస్ ఎంటర్టైన్‌కు నేటితో పన్నెండేళ్లు కావడంతో సోషల్ మీడియాలో రెడీ మూవీ టాపిక్ హల్చల్ అవుతోంది. దర్శకుడు శ్రీనువైట్ల రెడీ చిత్రంపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

శ్రీనువైట్ల రెడీ చిత్రం గురించి స్పందిస్తూ.. 'పన్నెండేళ్లు అవుతున్నా అంతా నిన్న జరిగినట్టే అనిపిస్తోంది. ఆ షూటింగ్ జరుపుకున్న క్షణాలనెప్పుడూ మరిచిపోను ఎంతో అందంగా గడిచాయి. అందంతా ఎనర్జిటిక్ స్టార్ రామ్, క్యూట్ జెనీలియా మూలానే. గోపీమోహన్, కోన వెంకట్ నన్ను నమ్మినందుక ధన్యవాదాలు. కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేసిన దేవీకి ధన్యవాదాలు. మమ్మల్ని ప్రోత్సహించిన నిర్మాత స్రవంతి రవికిషోర్‌కు ధన్యవాదాల'ని తెలిపాడు.


Click it and Unblock the Notifications











