twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి మళ్లీ అలా చేయడు, 145 మిస్టేక్స్ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి కలెక్షన్ల పంట పండింది. అంతా బాగానే ఉన్నా..... హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే వాళ్లకి మాత్రం ‘బాహుబలి'లో చాలా మిస్టేక్స్ కనిపించాయి. మనదేశంలోని సినిమా ప్రమాణఆలతో పోలిస్తే ‘బాహుబలి' విజువల్ వండరే కానీ... ప్రపంచ స్థాయితో పోలిస్తే ఈ చిత్రం విజువల్ ఎపెక్ట్ష్ పరంగా చాలా పూర్ అనే విమర్శలు వచ్చాయి.

    Also Read: టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

    ఈ నేపథ్యంలో ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి... ప్రస్తుతం తెరకెక్కిస్తున్న బాహుబలి పార్ట్ 2లో మాత్రం అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సినిమాలో మెయిన్ గా హైలెట్ అయ్యేవి విజువల్ ఎఫెక్ట్స్ కాబట్టి...ఈ సారి ఈ విషయంలో మరింత పర్‌ఫెక్ట్ వ్యవహరించబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను రంగంలోకి దింపబోతున్నారట.

    Also Read: బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు

    బాహుబలి-2 షూటింగ్‌ డిసెంబర్లో మొదలై శరవేగంగా సాగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

    చైనాలో...
    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి తోసింది. తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ‘బాహుబలి' మరో 100 కోట్లు రాబడుతుందని భావిస్తున్నారు. చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించినట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేయించారు. ఈ స్టార్ ఫిలింస్ వారు 6వేల ప్రింట్లతో చైనాలో ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేస్తున్నారు.

    ప్రభాస్...
    బాహుబలి మొదటి పార్టులో శివుడు పాత్రలో 130 కేజీల ఫిజిక్ తో బలిష్టంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ తర్వాత ప్రభాస్ మళ్లీ కాస్త నార్మల్ గా అయ్యాడు. మళ్లీ ఇపుడు బాహుబలి-2 కోసం కొన్ని రోజుల ముందు నుండే ప్రభాస్ వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్, డైటీషియన్స్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తూ, ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. బాహుబలి-2 కోసం ప్రభాస్ ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాడనే విషయాలు బయటకు వచ్చాయి. ప్రభాస్ రోజు రెండు సెషన్స్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఉదయం గంటన్నర, సాయంత్ర గంటన్నర పాటు వ్యాయామానికి కేటాయిస్తున్నాడు. ఇందుకోసం ప్రభాస్ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసారు. జిమ్ ఎక్విప్ మెంట్స్ ప్రత్యేకంగా అమెరికా నుండి తెప్పించారు. బేసిక్ వార్మ్ అప్స్ పూర్తయిన తరువాత.... 15 నిమిషాల పాటు కార్డియోవాస్కులర్ ఎక్సర్ సైజ్, 15 నిమిషాల పాటు యోగా, డంబెల్, స్ట్రెచ్చెస్ తదితర వ్యాయామాలు చేస్తున్నాడు. క్రాస్ ఫిట్, పాలీమెట్రిక్స్ ప్రభాస్ డైలీ కార్డియో ట్రైనింగులో భాగంగా ఉన్నాయి. డైట్ విషయానికొస్తే....నిపుణులు సూచించిన ఆహారాన్ని ప్రభాస్ ఇంట్లోనే తయారు చేయిస్తున్నారు.

    English summary
    Everybody knows that Baahubali is a big hit movie in Indian History. But in Baahubali there are few mistakes which You Never Noticed. Check out 145 Mistakes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X