15 రోజుల క్రితమే.. డ్రైవర్‌కు షరతులు పెట్టిన హరికృష్ణ.. అతడు వచ్చి ఉంటే!
Recommended Video

నందమూరి హరికృష్ణ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్నే మిగిల్చింది. హైదరాబాద్ ముంచి నెల్లూరుకు వెళుతూ నల్గొండ సమీపంలో ప్రమాదానికి గురై హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంత్య క్రియలు ప్రభుత్వలాంఛనాలతో జరగనున్నాయి. ఇదిలా ఉండగా తనకు అత్యంత ఇష్టమైన డ్రైవింగ్ వలనే ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

డ్రైవింగ్ అంటే ఇష్టం
డ్రైవింగ్ అంటే మక్కువతోనే ఆయన తన వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ నెల్లూరుకు బయలుదేరారు. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. హరికృష్ణ తరచుగా డ్రైవర్లని మారుస్తుంటారట. ఆయన వాస్తు, జాతకాలాని బలంగా నమ్ముతారు.

15 రోజుల క్రితమే
హరికృష్ణ 15 రోజుల క్రితమే మంచి డ్రైవర్ కావాలని తనని అడిగినట్లు టీడీపీ సీనియర్ నేత అమర్ నాథ్ బాబు అన్నారు. తనకు తెలిసిన ఓ యువకుడిని హరికృష్ణ వద్దకు పంపా. కానీ హరికృష్ణ పెట్టిన షరతులు అతడికి నచ్చక డ్యూటీలో జాయిన్ కాలేదని అమర్ నాథ్ అన్నారు.

బయో డేటా పరిశీలించి
అమర్ నాథ్ తనకు తెలిసిన డ్రైవర్ ని హరికృష్ణ వద్దకు పంపాడు. హరికృష్ణ అతడి బయో డేటా పరిశీలించి కొన్ని షరతులు విధించారట. సిటీలో 80 కిమీలోపు, హైవే లో 100 కిమీ లోపు వేగంతో డ్రైవ్ చేయాలని సూచించాడట. ప్రతిరోజు తనని ఇంటి వద్ద దింపాక హోటల్ లోనే పడుకోవాలని సూచించాడట.

నచ్చకపోవడంతో
ఈ షరతులకు అంగీకారమైతే డ్యూటీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ యువకుడికి షరతులు నచ్చినట్లు లేవు. మళ్ళి రాలేదు. ఒకవేళ ఆ యువకుడు డ్యూటీలో చేరిఉంటే హరికృష్ణకు ఈ ప్రమాదం తప్పేదని అమర్ నాథ్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











