»   » బ్యూటిఫుల్ తమన్నాతో ఫ్రాన్స్‌లో అంటూ నాగ్ ట్వీట్

బ్యూటిఫుల్ తమన్నాతో ఫ్రాన్స్‌లో అంటూ నాగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కింగ్ నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరఫ్ జరుగుతోంది. జులై 7న ప్రారంభమైన షూటింగ్ ఆగస్టు 10 వరకు సాగుతుంది.

తాజాగా ఈ సినిమా గురించిన విశేషాలు నాగార్జున ట్విట్టర్ ద్వారా వివరించారు. 15 రోజుల పాటు కార్తి, తమన్నాలతో పివిపి సినిమా షూటింగ్ ఫ్రాన్స్ జరిగింది. మరో 10 రోజుల్లో బయల్దేరుతాం అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.

యూరఫ్ షూటింగ్ బయల్దేరే ముందు నాగార్జున, కార్తి, పివిపి, వంశీ పైడిపల్లి చెప్పి విశేషాలు....
నాగార్జున మాట్లాడుతూ...తెలుగు, తమిళ భాసల్లో రూపొందుతున్న ఈ మూవీ చాలా బాగా వస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. నా కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. పివిపి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు అన్నారు.

కార్తి మాట్లాడుతూ...తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్న స్ట్రైట్ మూవీ చాలా భారీ లెవల్ లో నిర్మిస్తున్నారు పివిపిగారు. నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో కలిసి ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది' అన్నారు.

నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి మాట్లాడుతూ...‘నాగార్జున, కార్తి కాంబినేషన్లో మా బేనర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చెన్నైలో 20 రోజుల పాటు జరిగింది. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో వేసిన భారీ సెట్ లో 25 రోజుల పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. జులై 7 నుండి జరిగే మూడో షెడ్యూల్ యూరఫ్ లోని రేర్ లొకేషన్స్ అయిన సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో స్టార్ట్ చేస్తున్నాం. సౌత్ ఈస్ట్ యూరఫ్ లో పెద్ద సిటీ అయిన బెల్ గ్రేడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సౌత్ ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. బెల్ గ్రేడ్ తర్వాత ఫ్రాన్స్ లోని ప్యారిస్, లియాన్ లలో షూటింగ్ జరుపుతాము.

15 days of Filming in France : Nagarjuna

స్లోవేనియా రాజధాని జబ్లిజనాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో నాగార్జున, కార్తి, తమన్నా పాల్గొనే కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ మరింత అందంగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఈ చిత్రం కోసం చేసిన అద్భుతమైన కొన్ని పాటలను ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించబోతున్నాం. ఈ మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...‘సినిమా చాలా బాగా వస్తోంది. మా కథకు మండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే నాగార్జున, కార్తీలతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. నాగార్జున, కార్తి, తమన్నా, జయసుధ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.'

English summary
"15 days of Filming in France with talented Karthi and beautiful Tamannaah for Pvp,10 more days to go." Nagarjuna said.
Please Wait while comments are loading...