twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున గెస్ట్ హౌస్‌లో అనుష్కశెట్టి.. అసలు విషయాన్ని బయటపెట్టిన రాఘవేంద్రరావు

    |

    సూపర్‌ మూవీతో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన అనుష్క శెట్టి సినీ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. చిత్ర సీమలో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ ఓ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, వైవీఎస్ చౌదరీ, దశరథ్, నిర్మాతలు సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, పీవీపీ తదితరులు పాల్గొన్నారు.

    శ్రీ రామదాసు సమయంలో

    శ్రీ రామదాసు సమయంలో

    ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, "తొలిసారి స్వీటీని చూడ‌టం ఒక ఎక్స్‌పీరియెన్స్‌. ఫస్ట్‌ టైం నాగార్జున గెస్ట్ హౌస్‌లో కలిశాను. 'శ్రీ‌రామ‌దాసు' తీసేప్పుడు నాగార్జున‌తో మాట్లాడటానికి గెస్ట్ హౌస్‌కు వెళ్లినప్పుడు స్వీటిని కలిశాను. ఆయ‌న 'డైరెక్ట‌ర్‌గారూ స‌రైన టైమ్‌కు వ‌చ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి'.. అని చెప్పి, 'స్వీటీ' అని పిలిచాడు. సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ వ‌చ్చింది. మొద‌ట క‌ళ్లు, త‌ర్వాత ముఖం, ఆ త‌ర్వాత మ‌నిషి పైకి వ‌చ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో అన్నాను.. 'నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ' అని చెప్పాను.

    సూపర్ అనిపించావు అనుష్క

    సూపర్ అనిపించావు అనుష్క

    ఇవాళ నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఆరోజు అక్క‌డ ఎలాగైతే మెట్లెక్కి వ‌చ్చావో, అలాగే బంగారు మెట్లెక్కుతూ కెరీర్‌లో ముందుకు వ‌చ్చావు. పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ పిక్చ‌ర్ చేశావు. హీరోయిన్ల‌ను పూరి ఎలా చూపిస్తాడో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 'సూప‌ర్' అనిపించావ్‌. ఆ త‌ర్వాత శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్‌తో చేసిన 'అరుంధ‌తి'తో నీకు గ‌జ‌కేస‌ర యోగం ప‌ట్టింది. అప్పుడే ఏనుగును ఎక్కేశావ్‌. ఆ త‌ర్వాత 'భాగ‌మ‌తి', గుణ‌శేఖ‌ర్ సినిమా 'రుద్ర‌మ‌దేవి', 'బాహుబ‌లి'లో దేవ‌సేన‌గా హంస‌వాహ‌నం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిపోయావ్‌. ఆ సినిమాలో 'ఊపిరి పీల్చుకో' అని నువ్వు చెప్పిన డైలాగ్‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది.

    న‌మో వెంక‌టేశాయ‌'లో ఒక భ‌క్తురాలిగా

    న‌మో వెంక‌టేశాయ‌'లో ఒక భ‌క్తురాలిగా

    నా సినిమా 'న‌మో వెంక‌టేశాయ‌'లో ఒక భ‌క్తురాలిగా చేశావ్‌. ప్ర‌య‌త్నిస్తే సినిమాలు దొరుకుతాయ్‌. కానీ నీ విష‌యంలో క్యారెక్ట‌ర్లే నిన్ను వెతుక్కుంటూ వ‌చ్చాయ్‌. ఈ జ‌న‌రేష‌న్‌లోని మ‌రే హీరోయిన్‌కీ ఆ అదృష్టం ద‌క్క‌లేదు. నీ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్ల‌ను పొందావు. 'అనుష్క చాలా మంచిది, అందుకే ఆ క్యారెక్ట‌ర్లు వ‌చ్చాయి' అని అంద‌రూ చెప్పే విష‌య‌మే. అంద‌రినీ నీ కుటుంబంలా చూసుకుంటావ్‌.

    Recommended Video

    Anushka Shetty Open Up On Dating A Cricketer | Filmibeat Telugu
     మౌన మునిక‌న్య‌గా

    మౌన మునిక‌న్య‌గా

    తెలుగులోనే కాకుండా త‌మిళ‌నాడులో, క‌ర్ణాట‌క‌లోనూ ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న నీ జ‌న్మ ధ‌న్యం. నీకూ, నాకూ ద‌గ్గ‌ర పోలిక ఉంది. న‌న్ను 'మౌన ముని' అని పిలిచేవారు. నువ్వు ఈ 'నిశ్శ‌బ్దం' సినిమాతో మౌన మునిక‌న్య‌గా అయిపోతావ్‌. డైరెక్ట‌ర్ హేమంత్ ఈ సినిమా క‌థ నాకు చెప్పాడు. ఆ క్యారెక్ట‌ర్ ఎలా చేసుంటావో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నీ సామ‌ర్థ్యం నాకు తెలుసు. హేమంత్ వెరీ గుడ్ డైరెక్ట‌ర్‌. నిర్మాత‌లు నాకు బాగా తెలుసు. ఈ పిక్చ‌ర్ పెద్ద హిట్ట‌వ్వాలి" అని చెప్పారు.

    English summary
    15 years of Anushka Shetty event conducted with great way. Tollywood big celebrities attended for this function. Director K Raghavendra Rao told about Anushka Shetty helping nature.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X