»   » ఎలక్షన్ల తర్వాత 150వ సినిమా చేస్తా : చిరంజీవి

ఎలక్షన్ల తర్వాత 150వ సినిమా చేస్తా : చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు శుభ వార్త. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మెగాస్టార్ 150వ సినిమా కల త్వరలో నిజం కాబోతోంది. త్వరలో జరుగబోయే ఎన్నికల అనంతరం 150వ సినిమాలో నటిస్తానని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

'ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులతో ఫోన్లో ఇంటరాక్ట్ అయిన చిరంజీవి......ఎన్నికల తర్వాత 150వ సినిమాలో నటిస్తానని చెప్పారని' ఉత్తారాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పైడి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకోసం పలు స్క్రిప్టులు వింటున్నట్లు తెలుస్తోంది.

150th film after elections, Says Chiru

కాగా.....చిరంజీవి తన 150వ సినిమాను తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాన్ని కొద్ది పాటి మార్పులతో తెలుగులో అందించనున్నారు. దానికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారని టాక్. ఇంతకీ ఆ తమిళ సినిమా మరేదో కాదు...తాజాగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన జిల్లా.

ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ హీరోలుగా చేసారు. మోహన్ లాల్ పోషించిన పాత్రను చిరంజీవి చెయ్యాలని భావిస్తున్నారట. విజయ్ చేసిన పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని అనుకుంటున్నారట. రీసెంట్ గా రామ్ చరణ్ ఆ చిత్రాన్ని చూసినట్లు సమాచారం. జిల్లా చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయకపోవటానికి కారణం రీమేక్ చేయాలనే ఆలోచనే అంటున్నారు.

English summary
“Megastar Chiranjeevi interacted with the fans during a teleconference. He said he will act in his 150th film after the elections,” shares Pydi Srinivas, president, Uttar Andhra Chiranjeevi Fan Club.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu