ప్రభాస్ హీరోయిన్ కోసం 4 కోట్ల ఇల్లు.. కాంప్రమైజ్ అయ్యేలా లేరుగా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 1960. 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాహో చిత్రం పూర్తి కావస్తుండడంతో ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ లో చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.

అబ్బురపరిచేలా సెట్లు
సినిమా అనుకున్న విధంగా పూర్తి కావాలంటే, మంచి అవుట్ పుట్ రావాలంటే ఖర్చుకు వెనకాడకూడదు. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు చిత్రాలకు మార్కెట్ పెరుగుతుండడంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది. సినిమాల్లో ప్రేక్షకులని అబ్బురపరిచేలా ఉండే సెట్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. బాహుబలి కోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. చూడాలని ఉంది చిత్రం కోసం హైదరాబాద్ లోనే కోల్ కతా నగరాన్ని నిర్మించారు. ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ వేశారు. ఇలాపాలు చిత్రాల్లో రూపొందించిన సెట్స్ హైలైట్స్ గా నిలిచాయి.

హైదరాబాద్‌లో రోమ్ నగరం
రోమ్ నగరం ఎంతటి చరిత్రాత్మకమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ నగరంలోని కట్టడాలు ఇప్పటికి పర్యాటకులని ఆకర్షిస్తుంటాయి. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ ఓ తెరకెక్కబోతున్న చిత్రం ఇటలీ నేపథ్యంలో ఉండబోతోంది. దీనితో చిత్రయూనిట్ హైదరాబాద్ లో రోమ్ నగరానికి సంబంధించిన సెట్స్ నిర్మిస్తున్నారు. అత్యంత భారీ ఖర్చుతో ఏకంగా 18 సెట్లు నిర్మిస్తున్నారట. ఈ సెట్స్ లోనే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువభాగం సాగుతుంది.

4 కోట్ల ఇల్లు
18 సెట్లలో ఇప్పటికే మూడు సెట్స్ పూర్తయ్యాయట. అందులో ఒకటి హీరోయిన్ ఇల్లు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హీరోయిన్ ఇంటికి కోసం ఏకంగా 4 కోట్ల భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్ నిర్మించారు. ప్రభాస్ తదుపరి చిత్రం విషయంలో చిత్ర యూనిట్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కేవలం సెట్లకే ఈ స్థాయిలో ఖర్చు చేస్తుంటే సినిమా మొత్తం బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రోమ్ పరిస్థితులపై అధ్యయనం
ఈ చిత్రం 1960 కాలం నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఆ సమయంలో రోమ్ నగరం ఎలా ఉండేది, అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉండేది, ఎలాంటి వస్తువులు ఉపయోగించేవాళ్ళు లాంటి అంశాలని క్షుణ్ణయంగా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డేపై వచ్చే కొన్ని సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











