నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫస్ట్‌లుక్
హైదరాబాద్: ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు వరుసగా సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న నితిన్ త్వరలో 'కొరియర్ బాయ్ కళ్యాణ్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఫోటాన్, కథాస్ పతాకంపై ప్రేమ్‌సాయి దర్శకత్వంలో నితిన్ కథానాయకుడుగా నిర్మిస్తున్న 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్‌కు జోడీగా యామీ గౌతమి నటిస్తోంది. నవంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ప్రేమ్‌సాయి మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఓ సరికొత్త పాత్రలో నితిన్ నటిస్తున్న ఈ చిత్రం ఆయన గత చిత్రాల్లాగే విజయవంతమవుతుందని అన్నారు. సత్యం రాజేష్, హర్ష, జైసంతానం, వి.టి.వి.గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, ఎడిటింగ్: ఆంథోనీ, కెమెరా: ఓంప్రకాష్, నిర్మాత: గౌతం వాసుదేవమీనన్, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.


Click it and Unblock the Notifications











