2.0 అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది: హాట్ కేకుల్లా మాయం, ఉదయం 4 గంటలకే...

Recommended Video

#2point0 Movie : 2.0 Movie Tickets Was Sold Like Cakes In Bangalore

ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీ 2.0 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్‌ చూసేందుకు సినీ అభిమానులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సినిమా విడుదలవుతుండగా... అన్నింటికంటే ముందుగా బెంగుళూరులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

ఉదయం 4 గంటల నుంచే షోలు

ఉదయం 4 గంటల నుంచే షోలు

బెంగుళూరులో కొన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచే ‘2.0' షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కర్నాటకలోనే పరిస్థితి ఇలా ఉందంటే... రజనీకాంత్‌ను దేవుడుగా ఆరాధించే తమిళనాడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కర్నాటక వ్యాప్తంగా 300 స్క్రీన్లలో రజనీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

హిందీలోనూ భారీ క్రేజ్

హిందీలోనూ భారీ క్రేజ్

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తుండటంతో హిందీలోనూ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. హిందీ మార్కెట్ పెద్దది కావడంతో ఇక్కడి నుంచే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇండియా మొత్తం 10 వేల స్క్రీన్లలో

ఇండియా మొత్తం 10 వేల స్క్రీన్లలో

2.0 చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిసి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 10 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 1500 వరకు 3డి స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

విదేశాల్లోనూ భారీ రిలీజ్

విదేశాల్లోనూ భారీ రిలీజ్

ఈ చిత్రాన్ని ఇండియన్స్ స్థిరపడ్డ ఇతర దేశాల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో రజనీకాంత్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జపాన్, కొరియాతో పాటు చైనా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్

2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్

ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.

త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్

త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్

ఇటీవల ఈ చిత్రం గురించి డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ - ``సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా `2.0`. పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్టైన్‌మెంట్‌. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతారు. రెహ‌మాన్‌గారు, రసూల్ పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మ‌నం చేయ‌గలం అని నిరూపించాం. నిర్మాత‌ సుభాష్ క‌ర‌ణ్ సుభాష్ క‌ర‌ణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్‌ సినిమాను ఇంత బడ్జెట్‌ తో ఎవరూ నిర్మించరు. ఆయ‌న అందించిన ప్రోత్సాహంతో పాటు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అందించిన తోడ్పాటుతో గొప్ప అనుభూతిని ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాం`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X