2.0 ఆడియో లాంచ్ ఈవెంట్, దుబాయ్ వెళ్లలేని ఫ్యాన్స్‌కి నిరాశే!
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ వద్దగల బుర్జ్ పార్క్ లో గ్రాండ్ గా 2.0 ఆడియో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది.
రజనీకాంత్ హీరోగా నటించిన '2.0' చిత్రం ఆడియో వేడుక దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ వద్దగల బుర్జ్ పార్క్ మైదానంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆడియో వేడుక ఆన్ లైన్ ద్వారా లైవ్ చూద్దామని చాలా మంది అభిమానులు ఆశ పడ్డారు. అయితే అలాంటి వారందరికీ నిరాశే ఎదురైంది. ఈ ఆడియో లాంచ్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జీటీవీ వారు లైవ్ ప్రసారం చేయడం లేదు. తర్వాత ఈ వేడుక ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేసేందుకు జీ టీవీ వారు ప్లాన్ చేస్తున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో వేడుక
శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ సినీ చిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకుంటోంది. రూ.12కోట్ల వ్యయంతో దుబాయ్‌లో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
తొలిసారి అనుమతి
తొలిసారిగా దుబాయ్ గవర్నమెంట్ ఇక్కడ ఈ స్థాయిలో ఆడియో వేడుక నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అభిమానుల కోసం ఇప్పటికే దాదాపు 12000 ఫ్రీ పాసులు పంచి పెట్టారు. విఐపి టేబుల్స్ ఫర్ ఫ్యామిలీ... ఒక్కోటి రూ. 6 లక్షలుకు అమ్మారు.
రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ హైలెట్
సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వేడుకలో హైలెట్ కానుంది. 125 మంది సింఫనీ కళాకారులతో కలిసి ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా 1.5 లక్షల మంది లైవ్ చూస్తారని అంచనా
ఆడియో వేడుక లైవ్ చూసేందుకు దుబాయ్ మాల్స్ లో రూ. 2 కోట్లతో ఎల్ ఈడీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 1.5 లక్షల మంది లైవ్ చూస్తారని అంచనా.
తమన్నా లైవ్ డాన్స్ ఫెర్ఫార్మెన్స్
ఈ ఆడియో రిలీజ్ వేడుకలో హీరోయిన్ తమన్నా చిట్టిరోబోగా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.
.


Click it and Unblock the Notifications











