దడదడలాడిస్తున్న రోబో2.0 కొత్త పోస్టర్.. దుబాయ్‌లో రానా హల్‌చల్

By Rajababu

Recommended Video

Just One Song In Rajinikanth's "2.0" రోబో 2.0 లో పాటల సంగతేంటో

దుబాయ్‌లో ఇపుడు ఎక్కడ చూసినా రోబో ఫివరే. దుబాయ్ మొత్తం ప్రస్తుతం రోబో పోస్టర్లతో కళకళలాడుతున్నది. కేవలం దుబాయ్‌లోనే కాదు పలు దేశాల్లో సగటు సినిమా ప్రేక్షకుడి నోట రోబో ముచ్చటే వినిపిస్తున్నది. శుక్రవారం (27) రాత్రి 6 గంటల నుంచి దుబాయ్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుర్జ్ అల్ అరబ్ వద్ద అట్టహాసంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

రోబో2.0 న్యూ పోస్టర్

దుబాయ్‌లో ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఓ వినూత్నమైన రోబో 2.0 పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బంగారు, నలుపు రంగుల్లో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

 చిట్టిగా రజనీకాంత్

చిట్టిగా రజనీకాంత్

చిట్టిగా రజనీకాంత్, మానవ రూపంలో ఉన్న రోబోగా అమీ జాక్సన్ పోస్టర్‌లో కనిపించారు. వెనుక డాక్టర్ రిచర్డ్ అనే విలన్ పాత్రలో నటిస్తున్న బర్డ్ మ్యాన్ అక్షయ్ కుమార్ చిత్రాన్ని కూడా పోస్టర్‌లో పెట్టారు.

ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్

ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్

దుబాయ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సోఫాలో కూర్చున్న రజనీకాంత్ ఫొటోను రిలీజ్ చేశారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఏఆర్ రెహ్మన్ లైవ్ ప్రదర్శన ఉంటుంది అని పోస్టర్‌లో పేర్కొన్నారు.

 కోలాహలంగా దుబాయ్

కోలాహలంగా దుబాయ్

దుబాయ్‌లో రోబో2.0 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం కోలాహాలంగా మారింది. రోబో చిత్ర యూనిట్ రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నది. కొందరు గగన విహారం చేస్తూ అతిపెద్ద రోబో పోస్టర్‌ను చేతపట్టుకొని దూకే సన్నివేశం అందర్ని ఆకట్టుకొంటున్నది.

 రానా హోస్ట్‌గా

రానా హోస్ట్‌గా

అంగరంగ వైభవంగా జరిగే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X