twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి‘ని తలదన్నేలా రోబో 2.0 ఆడియో.. 15 కోట్ల ఖర్చుతో దిమ్మతిరిగేలా ఫంక్షన్

    ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకుల కల మరో మూడు రోజుల్లో నెరవేరనున్నది. బాహుబలి చిత్రాన్ని తలదన్నేలా రూపుదిద్దుకొంటున్న రోబో 2.0 చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం అక్టోబర్ 27న దుబాయ్‌లో జరుగను

    By Rajababu
    |

    ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకుల కల మరో మూడు రోజుల్లో నెరవేరనున్నది. బాహుబలి చిత్రాన్ని తలదన్నేలా రూపుదిద్దుకొంటున్న రోబో 2.0 చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం అక్టోబర్ 27న దుబాయ్‌లో జరుగనున్నది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా రోబో ఆడియో ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    కనీవిని ఎరుగని రీతిలో

    కనీవిని ఎరుగని రీతిలో

    అక్టోబర్ 27 (శుక్రవారం) సాయంత్రం దుబాయ్‌లోని ప్రతిష్ఠాత్మక బుర్జ్ పార్క్‌లో రోబో 2.0 ఆడియో ఆవిష్కరణ కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వైభవంగా జరిగే ఈవెంట్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

    ఏఆర్ రెహ్మాన్ లైవ్‌

    ఏఆర్ రెహ్మాన్ లైవ్‌

    రోబో 2.0 ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్‌ ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఈ వేడుక కోసం దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్ వినూత్న ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నది. దుబాయ్‌లో ఆడియో ఆవిష్కరణకు ముందు అనేక కార్యక్రమాలను చేపట్టనున్నారు.

    వెరైటీ ప్రచారం.. ప్రమోషన్

    వెరైటీ ప్రచారం.. ప్రమోషన్

    ఇప్పటికే లైకా ప్రొడక్షన్ వెరైటీ ప్రచారాన్ని చేపట్టింది. 100 అడుగుల హాట్ ఎయిర్ బెలూన్‌ను ప్రచారం కోసం ఆవిష్కరించింది. ఆ బెలూన్ ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించారు.

    డిసెంబర్‌లో ట్రైలర్‌

    డిసెంబర్‌లో ట్రైలర్‌

    డిసెంబర్‌లో రోబో 2.0 చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నవంబర్‌లో, ట్రైలర్‌ను డిసెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రోబో 2.0ను 2018 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సాంకేతిక అంశాలను జోడించిన చిత్రంగా రోబో 2.0 ఓ ప్రత్యేకతను సంతరించుకొన్నది.

    తొలిసారి దక్షిణాదిలో అక్షయ్

    తొలిసారి దక్షిణాదిలో అక్షయ్

    రోబో 2.0 చిత్రం కోసం బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అక్షయ్ కుమార్ తొలిసారి దక్షిణాది ప్రధానంగా తమిళ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ చిట్టి, డాక్టర్ వసీకరణ్ పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    English summary
    Robo 2.0 audio launch on October 27th. It’s an event held in Burj Park in Dubai. AR Rahman, the composer for 2.0 is expected to perform live. It’s going to be one of the grandest audio events, after all the budget of this launch alone is a whopping Rs 15 crore. Lyca productions, the production house bank rolling rolling this sci fi film is going all out to make this a larger than life affair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X