Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
2.O మూవీకి గట్టి దెబ్బ.. శంకర్‌కు ఝలక్.. తమిళ్ రాకర్స్ అన్నంత పనిచేసింది!
రోబో సినిమాకు సీక్వెల్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో పైరసీ వెబ్సైట్ తమిళ్ రాకర్స్ సినిమా యూనిట్‌కి, లైకా ప్రొడక్షన్‌కు ఝలక్ ఇచ్చింది. తొలి ఆట ముగియకముందే ఆన్లైన్లో సినిమాను తమిళ రాకర్స్ లీక్ చేసింది. గతంలో 2.O మూవీని లీక్ చేస్తామని చెప్పి పైరసీ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
ఆన్లైన్లో హెచ్డీ క్వాలిటీ ప్రింట్
2.O మూవీ థియేటర్లలో రిలీజైన కొద్ది గంటల్లోనే తమిళ రాకర్స్ వెబ్సైట్లో దర్శనమిచ్చింది. హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్‌ను లీక్ చేసింది. లైకా ప్రొడక్షన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ రాకర్స్ ఎత్తుగడలను ఎదుర్కోలేకపోయింది. 2.O మూవీ పూర్తి చిత్రం ఆన్లైన్లో రావడంతో సినిమా యూనిట్ ఆందోళనలో పడింది.
2.O మూవీ వసూళ్లపై దెబ్బ
తమిళ రాకర్స్ లీక్ వ్యవహారం 2.O మూవీ కలెక్షన్లపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లపై పెద్ద దెబ్బ పడే ఛాన్సు ఉంటుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా దేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ రూ.600 కోట్లతో రూపొందించిన సంగతి తెలిసిందే.
2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం
తమిళ్ రాకర్స్‌పై పోరాటం
ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 చిత్రం పైరసీ గురికాకుండా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా పోస్ట్ చేసే డౌన్ లోడింగ్ లింకులపై ఉక్కుపాదం మోపేందుకు అనుమతి తీసుకొన్నారు. దాదాపు 12 వేల వెబ్సైట్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలో పైరసీ కాకుండా తగుజాగ్రత్తలు తీసుకొన్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న తమిళ రాకర్స్ లీక్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.
పైరసీ అడ్డుకట్టకు 10 మందితో టీమ్
2.0 సినిమాను పైరసీకి గురికాకుండా లైకా ప్రొడక్షన్ గట్టి జాగ్రత్తలు తీసుకొన్నది. పది మందితో బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నామో మేము బయటికి వెల్లడించలేమని చెప్పింది. గుట్టు చప్పుడు కాకుండా పైరసీ దాడులను అడ్డుకొంటామని లైకా ప్రొడక్షన్ చెప్పినప్పటికీ బలంగా ప్రభావం చూపలేకపోయింది.
చెన్నై, ఢిల్లీలో ప్రత్యేక బృందాలు
పైరసీని అడ్డుకునేందుకు చెన్నై, ఢిల్లీలో లైకా ప్రొడక్షన్ ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసింది పైరసీ లింకులు కనిపిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేస్తాం. థియేటర్లలో కొంత మంది సిబ్బందిని కూడా పెడుతున్నాం. మా పరిధిలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని లైకా ప్రొడక్షన్ వెల్లడించినప్పటికీ.. తమిళ రాకర్స్ ఆగడాలను నిలువరించలేకపోయింది.