2.0 మరో విధ్వంసం: దంగల్ 2వేల కోట్లు, బాహుబలి 1800 కోట్ల రికార్డ్ ఉఫ్...?
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర ధారులుగా శంకర్ రూపొందించిన మెగా విజువల్ వండర్ 2.0 ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ 400 కోట్లు రాబట్టి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్లలో సాధించిన వసూళ్లే.
అయితే దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద 2.0 బాహుబలి రికార్డులను అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ రజనీ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. చైనాలో ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించింది.

చైనాలో ఎన్ని స్క్రీన్లలో రిలీజవుతుందో తెలిస్తే షాకే...
చైనాలో 2.0 చిత్రాన్ని దాదాపు 56 వేల స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇందులో 47 వేలు 3డి స్క్రీన్లేనంట. ఇంత భారీ ఎత్తున ఒక ఇండియన్ మూవీ విడుదలవ్వడం ఇదే తొలిసారి.
చైనాలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థతో టై అప్
చైనాలో అతిపెద్ద మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్‌వై మీడియాతో అసోసియేట్ అయినట్లు లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. 56వేల స్క్రీన్లతో కూడిన 10వేల థియేటర్లో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్ల స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

చైనాలో ఇదో హిస్టరీ...
చైనా సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఒక విదేశీ చిత్రం 47 వేల 3డి స్క్రీన్లలో విడుదలవ్వడం ఇదే తొలిసారి. ఈ వైడెస్ట్ రిలీజ్ ద్వారా 2.0 చైనాలో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.

బాహుబలి 2, దంగల్ రికార్డులకు ఎసరు
2.0 చిత్రానికి చైనా ప్రేక్షకుల ఆదరణ లభిస్తే ఇప్పటి వరకు దంగల్ పేరు మీద ఉన్న రూ. 2 వేల కోట్ల కలెక్షన్ రికార్డ్, బాహుబలి 2 పేరు మీద ఉన్న 1800 కోట్ల కలెక్షన్ రికార్డు చెరిగిపోవడం ఖాయం. ఈ రెండు చిత్రాలు కూడా చైనా రిలీజ్ ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











