600 కోట్ల‌తో తీస్తే ఆ ఓపెనింగ్సా? నిర్మాతకు 200 కోట్లు నష్టం.. అక్షయ్‌పై కమల్ ఖాన్ ఫైర్!

Recommended Video

#2point0 : Akshay Kumar A B-Grade Actor, KRK Said On Twitter | Filmibeat Telugu

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన 2.O చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఓ వైపు సినిమాలోని టెక్నాలజీ అంశాలపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే 2.O చిత్రంపై దుమ్మెత్తి పోశాడు. అక్షయ్ కుమార్‌పై తీవ్రమైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించాడు. 2.O చిత్రంపై కేఆర్‌కే ఏమన్నాడంటే..

 అక్షయ్‌ కుమార్‌పై ఫైర్

అక్షయ్‌ కుమార్‌పై ఫైర్

అక్షయ్ కుమార్ బీ గ్రేడ్ యాక్టర్ అని ట్విట్టర్‌లో కమల్ ఆర్ ఖాన్ దుమ్మెత్తిపోశాడు. యువ హీరోలు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ సింగ్ లాంటి వాళ్లు 30 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుంటే.. సూపర్‌స్టార్ అయిన అక్షయ్ ఓపెనింగ్ కలెక్షన్లు 20 కోట్ల అని ప్రశ్నించాడు.

 బీ గ్రేడ్ యాక్టర్ అరి

బీ గ్రేడ్ యాక్టర్ అరి

2.O చిత్రం రూ.600 కోట్లతో రూపొందించారు. అందులో రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నాడు. అయినా హిందీలో అక్షయ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లలేకపోయాడు. దానిని బట్టి ఆయన సూపర్‌స్టార్ కాదు. బీ గ్రేడ్ యాక్టర్ అని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు.

 కమల్ ఖాన్‌ను ఆడేసుకొన్న నెటిజన్లు

కమల్ ఖాన్‌ను ఆడేసుకొన్న నెటిజన్లు

అక్షయ్ కుమార్‌పై విమర్శలు చేసిన కమల్ ఖాన్‌ను నెటిజన్లు ట్రోల్స్‌తో ఆడుకొన్నారు. కలెక్షన్లపై అవగాహన లేకుండా తప్పుడు సమాచారం ఇస్తావా? రఫ్ ఆడించారు. పబ్లిసిటీ కోసం తప్పుడు లెక్కలు చెప్పకు అని గట్టిగా మందలించారు.

తప్పుడు లెక్కలు వద్దని

తప్పుడు లెక్కలు వద్దని

రణ్‌వీర్ సింగ్‌కు అతిపెద్ద ఓపెనింగ్ పద్మావతి కలెక్ట్ చేసింది కేవలం 19 కోట్లు అని నిలదీశారు. రాజ్ కుమార్ హీర్వాణి మూవీ సంజూలో రణ్‌బీర్ నటించగా అది కేవలం 34.75 కోట్లు మాత్రమే సాధించింది అని నెటిజన్లు షాకిచ్చారు.

 200 కోట్లు నష్టం

200 కోట్లు నష్టం

2.O చిత్రం ఘనవిజయం సాధించడంతో ప్రేక్షకులకు శంకర్ థ్యాంక్స్ చెప్పగా దానిని కమల్ ఆర్ ఖాన్ తప్పుపట్టారు. సార్.. ఈ సినిమా డిజాస్టర్ అయితే నీవు సక్సెస్‌ఫుల్ అని చెబుతావు. నిర్మాతకు రూ.200 కోట్లు నష్టం రాబోతున్నది అని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ తర్వాత కమల్ ఖాన్‌ను శంకర్ బ్లాక్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X