Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ సర్‌తో తన్నులు తినడం గౌరవంగా భావించాను: అక్షయ్ కుమార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.
సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు.
ఇది నాకు సినిమా కాదు, ఒక పాఠశాల
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ఇది నాకు కేవలం సినిమా కాదు. ఒక పాఠశాల లాంటిది. నా ప్రిన్సిపల్ శంకర్. నేను గత 28 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ 28 ఏళ్లలో నేర్చుకున్న దానికంటే ఎక్కువగా ఈ సినిమాలో నేర్చుకన్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శంకర్‌కు థాంక్స్.
రజనీ సర్‌తో తన్నులు తినడం గౌరవంగా భావించాను
రజనీకాంత్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. ఆయన సింపుల్ గా ఒక లైన్ చెబుతారు. అది ప్రేక్షకుల్లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలాంటి స్టార్ సినిమాలో నాకు విలన్ రోల్ ఆఫర్ చేసినపుడు... ఆయనతో షూటింగులో తన్నులు తినడం కూడా ఎంతో గౌరవంగా భావించాను అని అక్షయ్ కుమార్ అన్నారు.
నేనూ మీలాగే వెయిట్ చేస్తున్నాను
సినిమా షూటింగును ఎంతో ఎంజాయ్ చేశాను. మీ లాగే నేనూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ సినిమా చూడలేదు. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సుభాష్ కరణ్ గారికి స్పెషల్ థాంక్స్ అని అక్షయ్ కుమార్ తన ప్రసంగం ముగించారు.
|
అక్షయ్ కుమార్ లుక్ మేకింగ్ వీడియో
2.0 విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ మేకప్ విషయంలో ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఇది కేవలం టెక్నికల్ వండర్ మాత్రమే కాదు, దీని వెనక ఎంతో శ్రమదాగి ఉంది.