ఆ రోజు రజనీ రాకుంటే బోలెడు నష్టం వచ్చేది, అదీ సూపర్ స్టార్ క్వాలిటీ: 2.0 ప్రెస్ మీట్లో శంకర్

Recommended Video

Robo 2.O Movie Press Meet : Rajinikanth Mesmerized By Shankar's Superb Telugu Speech | Filmibeat

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

శంకర్ మాట్లాడుతూ...

శంకర్ మాట్లాడుతూ...

2.0 ఒక యాక్షన్ ఎంటర్టెనర్, థ్రిల్లర్. అందులో ఒక మంచి ఎమోషనల్, సోషల్ స్టోరీ ఉంది. వేలాది మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కష్టపడితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 29న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామమని దర్శకుడు శంకర్ తెలిపారు.

 రజనీ ఆ పరిస్థితుల్లో కూడా వచ్చారు, లేకుంటే భారీ నష్టం

రజనీ ఆ పరిస్థితుల్లో కూడా వచ్చారు, లేకుంటే భారీ నష్టం

ఈ సినిమా క్లైమాక్స్ ఢిల్లీలో షూట్ చేశాం. రజనీకాంత్ ఆరోగ్యం బాలేక ట్రీట్మెంటులో ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండలో వచ్చి పని చేశారు. క్లైమాక్స్ షూటింగ్ 40 రోజులు సాగింది. ఫారిన్ టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ అంతా కలిసి 500 మంది వెయిట్ చేస్తున్నాం. షూటింగ్ కేన్సిల్ చేస్తే చాలా నష్టం వస్తుంది. అందరినీ మళ్లీ 40 రోజుల షూటింగుకు అసెంబిల్డ్ చేయడం కూడా చాలా కష్టం. ఇవన్నీ మనసులో పెట్టుకుని రజనీగారు తన హెల్త్ కండీషన్ బాగోలేకున్నా వచ్చి కంప్లీట్ చేశారు. అది సూపర్ స్టార్ క్వాలిటీ... అని శంకర్ చెప్పారు.

 హాలీవుడ్ సినిమాలకు తగ్గకుండా

హాలీవుడ్ సినిమాలకు తగ్గకుండా

అక్షయ్ కుమార్ కెరీర్లో ఇంత పెద్ద మేకప్ వేయలేదు. ప్రతి రోజూ మూడు గంటలు మేకప్ కోసం కేటాయించేవారు. భారీ కాస్టూమ్స్ వేసుకుని చాలా కష్టపడ్డారు. రెహమాన్ గారు ఆరు నెలల ముందే బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలు పెట్టారు. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ రేపు థియేటర్లో చూస్తే బ్యాట్ మెన్, స్పైడర్ మెన్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది

ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది

మేము ఇదంతా చేసినప్పటికీ ఈ క్రెడిట్ అంతా నిర్మాత సుభాష్ కరణ్ గారికే ఇవ్వాలి. ఒక ఇండియన్ సినిమాకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎవరూ చేయరు. సినిమా మీద ఉన్న పాషన్ తోనే ఆయన ఇంత ఖర్చు పెట్టారు.. అని శంకర్ తెలిపారు.

మీడియా వారికి రిక్వెస్ట్

మీడియా వారికి రిక్వెస్ట్

మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్. ఇలాంటి సినిమాకు మీరు సపోర్ట్ చేస్తే.... మన కంట్రీలో కూడా ఇలాంటి సినిమా చేయవచ్చు అని ప్రపంచానికి ప్రూవ్ చేయవచ్చు. వేలాది మంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు... అని తెలిపారు.

విజువల్ వండర్

విజువల్ వండర్

ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `2.0`.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X