రజనీ, శంకర్ కేక పెట్టించారు, మైండ్ బ్లోయింగ్.. 2.Oపై రకుల్ ప్రీత్, సిమ్రాన్, మహేష్‌ ట్వీట్స్

రోబోకు సీక్వెల్‌గా రూపొందిన 2.O చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను స్పందనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా లాంటి ప్రముఖులు ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే...

 తెర మీద కేక పెట్టించారు

తెర మీద కేక పెట్టించారు

2.O మూవీ గురించి పెట్ట దర్శకుడు కార్తీక్ సుబ్బరాయన్ ట్వీట్ చేశారు. తలైవా.. మీ నటన అద్భుతం. తెర మీద మీరు కేక పెట్టించారు. శంకర్ సార్, అతని జట్టు చరిత్రలో నిలిచిపోయే చిత్రాన్ని రూపొందించారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా 2.O మూవీ ఉంది. నా లాంటి అభిమానులకు ఈ రోజు పండుగనే అని కార్తీక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కళ్లు చెదిరేలా గ్రాఫిక్స్‌

కళ్లు చెదిరేలా గ్రాఫిక్స్‌

2.O యూనిట్‌కు కంగ్రాట్స్. ఈ సినిమా తెరపైన అద్భుతమైన సృష్టి. సామాజిక సందేశం, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ అదరగొట్టారు. రజనీ సార్ అల్టిమేట్. దర్శకుడు శంకర్ సార్‌కు తలవంచి నమస్కారం. అక్షయ్ చేరికతో ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా మారింది. నా పిల్లలతో కలిసి సినిమా చూసి బాగా ఆనందించాను అని సిమ్రాన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పెట్ట సినిమాలో రజనీ సరసన సిమ్రాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు శంకర్‌కు నా సెల్యూట్

దర్శకుడు శంకర్‌కు నా సెల్యూట్

2.O మూవీ అద్భుత దృశ్య కావ్యం. శంకర్ విజన్, ఆలోచనకు నా సెల్యూట్. సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది అని మారుతి ట్వీట్ చేశారు. .

భారీ బ్లాక్‌బస్టర్‌తో

భారీ బ్లాక్‌బస్టర్‌తో

ఇండియన్ సినిమా లెజెండ్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్. సూపర్ సక్సెస్ సాధించిన సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్. తలైవా, అక్షయ్ కుమార్, శంకర్‌కు నా నమస్సుమాంజలి అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

 రికార్డులు తిరగరాయాలని

రికార్డులు తిరగరాయాలని

సమాజానికి బలమైన సందేశంతో రూపొందిన ప్రభావవంతమైన సినిమా. రోబో2.0 మూవీ ఈ రోజు రిలీజైంది. అన్ని రికార్డులు తిరుగరాయాలని ఆశిస్తున్నాను. తలైవా రజనీకాంత్, అక్షయ్ కుమార్‌కు అభినందనలు అని హీరోయిన జుహీ చావ్లా ట్వీట్ చేశారు.

థ్రిల్లింగ్‌గా, మైండ్ బ్లోయింగ్‌

థ్రిల్లింగ్‌గా, మైండ్ బ్లోయింగ్‌

2.O మూవీ చూశాను. నమ్మశక్యం కావడం లేదు. చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. మైండ్ బ్లోయింగ్. సాంకేతిక అంశాలతోపాటు అన్ని విషయాలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌గా మార్చాయి. శంకర్, రజనీ సార్‌కు తలవంచి నమస్కరిస్తున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.

డైరెక్టర్‌ వదట్లేదని ఫిర్యాదు

డైరెక్టర్‌ వదట్లేదని ఫిర్యాదు

2.O మూవీ రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరిక. కానీ నా డైరెక్టర్ నన్ను షూటింగ్ నుంచి వదలడం లేదు. ఎలాగైనా 2.O మూవీ చూడాలని మనసు లాగుతున్నది. రజనీ మ్యాజిక్‌‌ను ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపిస్తున్నది అని కల్యాణి ప్రియదర్శన్ ట్వీట్ చేశారు.

హాలీవుడ్‌ ప్రమాణాలకు ధీటుగా

హాలీవుడ్‌ ప్రమాణాలకు ధీటుగా

2.O మూవీ అచ్చమైన భారతీయ సినిమా. హలీవుడ్ ప్రమాణాలకు ధీటైన మూవీ. మైండ్ బ్లోయింగ్. తలైవా ఒక్కడికే సాధ్యం. నటనతో మరోసారి మాయ చేశాడు. తమిళ, భారతీయ సినిమాకే శంకర్ గర్వకారణం. 2.O మూవీ యూనిట్ సభ్యులందరికీ నా కంగ్రాట్స్. థియేటర్లలో కాకుండా వేరే చోట ఎక్కడైనా ఈ సినిమా చూస్తే ప్రేక్షకులు తప్పి చేసినట్టే అని ధనుష్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ట్వీట్

మహేష్ బాబు ట్వీట్

అద్బుతమైన కాన్సెప్ట్. కళ్లుచెదిరే ట్వీట్స్. బాక్సాఫీస్‌పై చిట్టి దాడి చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నాను. రజనీ, శంకర్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్, ఇతర టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు అని ప్రిన్స్ మహేష్‌బాబు ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్‌కు దర్శకుడు స్పందించారు. థ్యాంక్స్ మహేష్ గారు అంటూ రెస్పాన్స్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X