రోబో 2.0 నిర్మాతల నిర్వాకం: అల్లు అర్జున్, మహేష్ సినిమాపై ఎఫెక్ట్
Recommended Video

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0' సినిమా జనవరిలో విడుదలవ్వాల్సి ఉండగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.
అయితే ఏప్రిల్‌లో ఏ డేట్ అనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ టాలీవుడ్ నిర్మాతలకు సందేశం పంపినట్లు సమాచారం.

టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన
లైకా ప్రొడక్షన్స్ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. అందుకు కారణం ఏప్రిల్ 27వ తేదీనే అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య', మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అను నేను' రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ చేసుకోవడమే.

రజనీ వస్తే చాలా కష్టం అవుతుంది
ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో పరిస్థితి చాలా టైట్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను ఇద్దరూ పంచుకోవాల్సిన పరిస్థితి. ఇపుడు రజనీకాంత్ 2.0 సినిమా కూడా వస్తే పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది.

సీరియస్‌గా తీసుకున్న బన్నీ వాసు
‘2.0' సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత బన్నీ వాసు సీరియస్ అయ్యారు. తాము ముందు నుండి ఒకే రిలీజ్ తేదీకి కట్టుబడి ఉన్నామని, కానీ లైకా ప్రొడక్షన్స్ వారు పలుమార్లు రిలీజ్ డేట్ మార్చారని, ఏప్రిల్ చివరి వారంలో 2.0 చిత్రాన్ని రిలీజ్ చేస్తే తమ సినిమాలపై ప్రభావం పడుతుందన్నారు.

రజనీ సినిమాను గౌరవిస్తాం
రజనీ సినిమాను తాము గౌరవిస్తాం, కానీ పదే పదే రిలీజ్ డేట్ మార్చడం వల్ల తమ సినిమాలపై ప్రభావం పడుతుందన్నారు. గతంలో 2.0 నిర్మాతలు జనవరిలో రిలీజ్ ఫిక్స్ కావడం వల్లే తాము తమ సినిమాలను ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధం చేసుకున్నామని, ఇపుడు మాట మార్చి తమ సినిమా విడుదల సమయంలో రిలీజ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ దృష్టికి తీసుకెళతాం
లైకా ప్రొడక్షన్స్ నిర్వాకాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తామని, ముందు నుండీ తాము కట్టుబడి ఉన్న తేదీనే తమ సినిమాలు విడుదల చేస్తామని తెలిపారు.

అదే తేదీపై ఎందుకు అంత పోటీ?
ఏప్రిల్ చివరి వారంలో అంత పోటీ ఉండటానికి కారణం.... వేసవి సెలవులు మొదలవ్వడమే. పిల్లలకు స్కూలు సెలవులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ ఎక్కువగా థియేటర్లకు వస్తారు. సినిమా పరిశ్రమకు మంచి వసూళ్లు తెచ్చే సీజన్ ఇది. అందుకే ఏప్రిల్ చివరి వారం విడుదలపై అంత పోటీ ఉంది.


Click it and Unblock the Notifications











